Lana Turner: అందం, అభినయంతో పాటు అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు హీరోయిన్స్. లేదంటే చాలా కష్టమే. ఇలా ఇండస్ట్రీకి వచ్చి అలా వెళ్లిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే స్టార్లు కూడా ఉంటారు. మరి ప్రపంచం మొత్తంలో సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె లైఫ్ గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోవాల్సిందే.
ఈమె ప్రియుడు ఓ గ్యాంగ్ స్టర్. సినిమాల్లో గ్యాంగ్ స్టర్స్ ను ప్రేమిస్తారు కానీ ఈ హీరోయిన్ రియల్ గానే గ్యాంగ్ స్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా నాలుగో పెళ్లి. వింటే వింతగా ఉంది కదూ. ఈ హీరోయిన్ గురించి కచ్చితంగా క్లుప్తంగా తెలుసుకోవాల్సిందే అనిపిస్తుందా. ఆమె ఎవరో కాదు అమెరికాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన లానా టర్నర్. ఈమెను జూలియా అని కూడా అంటారు. 15 సంవత్సరాలలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా, అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా పేరు సంపాదించింది.
దే విల్ నాట్ ఫర్గెట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్యూటీ సినిమాల్లో సక్సెస్ ఈ అమ్మడు లైఫ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ఈమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ ఈ ఏడుగురికి కూడా విడాకులు ఇచ్చింది. ఇందులో ఒకరు ఫేమస్ గ్యాంగ్ స్టర్ కూడా. 35 సంవత్సరాల వయస్సులో ఈ అమ్మడు నాలుగురిని పెళ్లి చేసుకుంది. ఆ నాలుగో భర్తనే గ్యాంగ్ స్టర్. ఏమైందో తెలియదు కానీ లానా టర్నర్ కూతురే ఈ గ్యాంగ్ స్టర్ ను పొడిచి మరీ చంపేసిందట. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం సృష్టించింది.
1966 తర్వాత ఈమె సినిమాల్లో నటించడం మానేసింది. 1995లో అంటే 74 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ.. లానా టర్నర్ చనిపోయింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఏడుగురిని పెళ్లి చేసుకున్న లానా ఒక్క బిడ్డకు మాత్రమే తల్లి అయింది.