Jaragandi Lyrical Song Video: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. 1985 మార్చి 27న జన్మించిన రామ్ చరణ్ 39వ ఏట అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని గేమ్ ఛేంజర్ మూవీ నుండి మాస్ సాంగ్ విడుదల చేశారు. జరగండి… పేరుతో విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి.
సాంగ్స్ తెరకెక్కించడంలో శంకర్ ని మించిన డైరెక్టర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. భారీ హంగులతో కనువిందుగా ఆయన పాటల చిత్రీకరణ ఉంటుంది. కేవలం సాంగ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. గేమ్ ఛేంజర్ మూవీలో కూడా సాంగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని జరగండి… సాంగ్ చూశాక అర్థం అవుతుంది. ఈ సాంగ్ కోసం ఓ పెద్ద కలర్ఫుల్ సెట్ వేశారు. కియారా అద్వానీ-రామ్ చరణ్ ల మీద మాస్ సాంగ్ చిత్రీకరించారు.
జరగండి.. సాంగ్ లో రామ్ చరణ్ కాస్ట్యూమ్స్, లుక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నార్త్ ఇండియన్ స్టైల్ ఆయన ఫాలో అయ్యాడు. అలాగే కియారా గ్లామరస్ లుక్ సైతం అదిరింది. జరగండి.. సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా పని చేశారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఇక థమన్ సంగీతం సమకూర్చారు. జరగండి… సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. క్షణాల్లో వైరల్ గా మారింది. సాంగ్ అద్భుతంగా ఉన్న నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగాయి.
దిల్ రాజు నిర్మాతగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్ తన మార్క్ పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ రూపొందిస్తున్నారు. శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు పొలిటికల్ డ్రామా జోనర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి గా నటిస్తున్నాడు. మరొక పాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారట. గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరింది. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం కలదు.