
Surya Kumra Yadav : సున్నా మీద భారతీయులకే పేటెంట్ రైట్. ఎందుకంటే దీనిని కనిపెట్టింది ఆర్యభట్టు. ఈ సున్నానే లేకపోతే గణితం లేదు, భౌతిక శాస్త్రమూ లేదు. ఈ సున్నా అంటే ఇష్టమో, లేక ప్రేమో తెలియదు కానీ.. భారత క్రికెటర్లు దీనిని బాగా ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్. ఏకంగా సున్నా అంటే తనకు ఎంత ఇష్టమో మూడుసార్లు వ్యక్తపరిచాడు. అది కూడా ఆస్ట్రేలియా జట్టు మీద.. మూడు మ్యాచ్ ల్లో 0 పరుగులకే అవుట్ అయ్యి రికార్డు సృష్టించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది. అంతకు ముందు సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేదు.. మరో వైపు అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.. అతడి స్థానంలో జట్టుకు గత్యంతరం లేక సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది.. కానీ అతడేమో ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యాడు.
గతంలోనూ సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, బుమ్రా, సచిన్ టెండూల్కర్, ఇలానే మూడు మ్యాచ్ ల్లో వరుసగా గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యారు. ఇక సూర్య కుమార్ యాదవ్ సున్నా పరుగులకే ఔట్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ” ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులు బయట ఉన్నారు.. వారికి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ సూర్య కుమార్ యాదవ్ వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు.. పైగా 0 పరుగులకే అవుట్ అవుతున్నాడు. అతగాడిని త్వరగా బయటికి పంపియండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.. టీ 20 లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ వన్డే లో ఇలానేనా ఆడేది అంటూ సెటైర్లు విసురుతున్నారు.. కీలక వికెట్లు పోగొట్టుకోవడంతో మూడో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది.