
Best runner in cricket : క్రికెట్లో ఒక్క పరుగు కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. ఆ మ్యాచ్ ఫలితాన్ని మార్చిన సమయంలో గానీ చాలామందికి ఆ పరుగు విలువ తెలియదు. అయ్యో ఆ సమయంలో రెండో పరుగుకు వెళ్ళుంటే బాగుండేదే అని ప్రతి క్రికెటర్ అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొంతమంది క్రికెటర్లు వికెట్ల మధ్య చిరుతల్లా పరిగెడుతూ పరుగులు చేస్తుంటే, మరికొందరు వికెట్ల మధ్య పరిగెత్త లేక నీరసించిపోతుంటారు.
క్రికెట్లో ఫోర్లు, సిక్సులు కొట్టడం ద్వారా వచ్చే పరుగులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ తెచ్చే పరుగులకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి బ్యాట్స్మెన్ చిన్నపాటి నిర్లక్ష్యం వలన కొరవడే ఒక్క పరుగు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. అందుకే ఫోర్లు, సిక్స్లు కొట్టడంతో పాటు వికెట్ల మధ్య చురుకుగా పరిగెత్తే బ్యాట్స్మెన్ లకు పరుగులు చేయడం సులభం అవుతుంది. క్రికెట్లో వికెట్ల మధ్య పరిగెత్తే బ్యాటర్ ఎవరు..? ఎవరు నెమ్మదిగా పరిగెడతారు..? వంట ప్రశ్నలు విరాట్ కోహ్లీకి ఎదురయ్యాయి. విరాట్ కోహ్లీ చెప్పిన సమాధానాలు ఏమిటో ఒకసారి చూసేద్దాం.
క్రికెట్ లో ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే క్రీడాకారులు విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఫిట్ గా ఉంటేనే మైదానంలో చురుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కోహ్లీ ఫీట్ గా ఉండడం వల్లనే మైదానంలో చిరుతలా కనిపిస్తుంటాడు. ఫోర్లు, సిక్స్లు బాధడంతో పాటు అంతే వేగంగా వికెట్ల మధ్య పరిగెడుతూ భారీగా పరుగుల చేస్తుంటాడు. అనేక సందర్భాల్లో విరాట్ కోహ్లీ ఇలా వేగంగా పరిగెత్తడం ద్వారా సింగిల్స్ ను డబుల్స్ గా మార్చి మ్యాచ్ విజయం సాధించేలా చేశాడు. ఇలా వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎందరో దిగ్గజ క్రికెటర్లు గురించి కోహ్లి తాజాగా షేర్ చేసుకున్నాడు. వారిలో మాజీ కెప్టెన్ మహేంద్ర ధోని ఒకరు.
-కోహ్లీ – డివిలియర్స్ మధ్య చర్చ..
వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే క్రీడాకారుల గురించి కోహ్లీ – డివిలియర్స్ మధ్య తాజాగా చర్చ జరిగింది. తనతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాట్స్మన్ ను ఎంపిక చేసుకోవాలని కోహ్లీకి డివిలియర్స్ ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఎబి డివిలియర్స్ పేరునే చెప్పాడు. డివిలియర్స్ తో పాటు చాలామంది ధోని పేరు చెబుతారని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా కోహ్లీ డివిలియర్స్ పేరు చెప్పడం గమనార్హం.
-గతంలో కూడా ఇదే ప్రశ్న..
ఈ ప్రశ్న అడిగిన జూలియర్స్కు సమాధానమిచ్చే క్రమంలో.. కోహ్లీ ఏమన్నాడంటే.. ‘ ప్రశ్న నాకు ఇంతకుముందు కూడా ఎదురయింది. వికెట్ల మధ్య నాతో అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగాడు ఏబి డివిలియర్స్. టికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ఆటగాడు ధోని. వాళ్లు ఎంత వేగంగా పరిగెడతారో నాకు తెలియదు. కానీ ఏబీ, ధోనితో కలిసి ఆడితే.. పరుగు కోసం వారిని పిలవాల్సిన అవసరమే ఉండదు’ అని కోహ్లీ వివరించాడు. ఇక ఇదే ప్రశ్న ఏబీడీని అడిగితే.. అతడు డుప్లేసిస్ పేరు చెప్పడం గమనార్హం.
-వివాదాస్పదమైన ప్రశ్న అంటూనే..
ఇక వికెట్ల మధ్య అత్యంత నెమ్మదిగా పరిగెత్తే బ్యాటర్ ఎవరు..? అని కోహ్లీని అడిగితే.. ఇది వివాదాస్పదమైన ప్రశ్న అంటూనే.. పూజారా పేరును నవ్వుతూ చెప్పాడు. 2018లో సెంచూరియన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో పూజార రన్ అవుట్ అయ్యాడని, అప్పుడు అతడు పరిగెత్తిన విధానాన్ని ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు.