https://oktelugu.com/

Isha Ambani: వజ్రాలు వైఢూర్యాల జాకెట్.. అంబానీ బిడ్డ మరీ.. ఆ మాత్రం ఉండాల్సిందే.. వైరల్ వీడియో

అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించేవారు.. అప్పట్లో ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు కోహినూర్ కాదు గాని అలాంటి వజ్రాలను, వైఢూర్యాలను, కెంపులను, రత్నాలను కలబోసి కుట్టిన జాకెట్ ను ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ ధరించారు.

Written By: Velishala Suresh, Updated On : March 7, 2024 8:24 am
Isha Ambani

Isha Ambani

Follow us on

Isha Ambani: 1000 కోట్లు ఖర్చు చేశారు, 2,500 రకాల వంటకాలు పెట్టారు, మూడు రోజులపాటు ధూమ్ ధామ్ చేశారు.. ఇవే కదా మొన్నటిదాకా జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకల గురించి రాసింది, చూపించింది. కానీ అక్కడ జరిగిన వాటితో పోలిస్తే అవి రాసింది, చూపించింది చాలా తక్కువ. ఎందుకంటే లాజర్ దెన్ లైఫ్ అనే లాగా అక్కడ వేడుకలు జరిగాయి. ప్రపంచ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అతిధులు హాజరయ్యారు. అంబరాన్ని మించేలాగా జరిపిన వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో ఒక వీడియో మాత్రం మరింత ఆశ్చర్యపరుస్తోంది.

అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించేవారు.. అప్పట్లో ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు కోహినూర్ కాదు గాని అలాంటి వజ్రాలను, వైఢూర్యాలను, కెంపులను, రత్నాలను కలబోసి కుట్టిన జాకెట్ ను ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ ధరించారు. ఆ జాకెట్ ధరించి తన తమ్ముడి ముందస్తు వివాహ వేడుకల్లో సందడి చేశారు. ఈ జాకెట్ విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రఖ్యాత డిజైనర్ ఆ జాకెట్ డిజైన్ త్రీడీలో రూపొందించి.. దాని నమూనా ఆధారంగా వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రత్నాలను జాకెట్ కు జత చేసి కుట్టారు. అలా రూపొందించిన జాకెట్ ను ధరించి ఈషా అంబానీ సందడి చేశారు..ఆ జాకెట్ రూపొందించిన విధానానికి సంబంధించిన వీడియో ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఐడీ లో పోస్ట్ చేయగా.. వేలాదిమంది వీక్షించారు. అదే స్థాయిలో లైక్ చేశారు.

కేవలం ఈషా అంబానీ ధరించిన జాకెట్ మాత్రమే కాదు..నీతా అంబానీ అంబానీ ధరించిన చీరలు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. నీతా అంబానీ ధరించిన చీరలను కట్టడానికే లక్షల్లో చెల్లించారట. డాలి జైన్ అనే మహిళ నీతా అంబానికి చీరలు కట్టారట. ఒక్కో చీర కట్టినందుకు లక్షల్లో ఆమెకు చార్జ్ రూపంలో ఇచ్చారట. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మార్చి ఒకటి నుంచి మూడు వరకు ముందస్తు పెళ్లి వేడుకలు జరిగాయి.. అవి ముగిసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా వాటి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆ వేడుకలకు సంబంధించి బహుశా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉంటుందేమో.. ఎంతైనా ముఖేష్ అంబానీ భారత దేశంలో అతిపెద్ద శ్రీమంతుడు కదా..