Homeక్రీడలుMost Runs As Captain: రౌండప్‌ : 2002లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లువీరే!!

Most Runs As Captain: రౌండప్‌ : 2002లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లువీరే!!

Most Runs As Captain: మరికొన్ని గంటల్లో 2022 కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ ఏడాది క్రీడారంగంలో కొందరికి తీపి జ్ఞాపకాన్ని మిగల్చగా, మరికొందరికి పరాభవం మిగిల్చింది. ఈ ఏడాది క్రికెట్‌ విభాగంలో కొందరు కెప్టెన్లకు కలిసొచ్చింది.

Most Runs As Captain
babar azam

– 2022 సంవత్సరంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు అంతగా కలిసిరాలేదు. కానీ ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌కు మాత్రం చాలా గొప్పగా నిలిచింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ ఓడిపోగా, టెస్టు క్రికెట్‌లో కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ ఏడాది పాకిస్థాన్‌ స్వదేశంలో ఏడు టెస్టులు ఆడగా ఒక్కటి కూడా గెలవలేకపోయింది. అయితే, కెప్టెన్‌ బాబర్‌ అద్భుతంగా రాణిస్తూనే తన పేరు మీద ఓ రికార్డును నెలకొల్పాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌ ఈ ఏడాది మొత్తం 2,598 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. బాబర్‌ ఈ ఏడాది తొమ్మిది టెస్టుల్లో 69.64 సగటుతో 1,184 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేలలో బాబర్‌ తొమ్మిది మ్యాచ్‌లలో 84.87 సగటుతో 679 పరుగులు చేశాడు. బాబర్‌ 26 టీ20 ఇంటర్‌నేషనల్‌ మ్యాచ్‌ల్లో 31.95 సగటుతో 735 పరుగులు చేశాడు. బాబర్‌ ఈ ఏడాది ఎనిమిది అంతర్జాతీయ సెంచరీలు చేశాడు.

Most Runs As Captain
Ponting

ముందంజలో పాంటింగ్‌..
2005లో 58 ఇన్నింగ్స్‌లలో 2,833 పరుగులు చేసిన కెప్టెన్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికీ పాంటింగ్‌ ముందు వరుసలో ఉన్నాడు. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన విషయానికొస్తే, టాప్‌–5లో విరాట్‌ కోహ్లీ పేరు మూడుసార్లు కనిపిస్తుంది. 2017లో కోహ్లీ 52 ఇన్నింగ్స్‌ల్లో 2818 పరుగులు చేశాడు. 2018లో కోహ్లీ 47 ఇన్నింగ్స్‌ల్లో 2,735 పరుగులు చేయగా, 2019లో 46 ఇన్నింగ్స్‌ల్లో 2,455 పరుగులు చేశాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular