Naresh- Pavitra Lokesh Marriage: నూతన సంవత్సరం ప్రారంభంలో అతిపెద్ద షాక్ ఇచ్చారు నరేష్-పవిత్ర లోకేష్. తాము వివాహం చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీని కోసం ఒక రొమాంటిక్ వీడియో చేసి విడుదల చేశారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్న నరేష్-పవిత్ర, లిప్ లాక్ చేసుకున్నారు. నరేష్ తన అధికారిక ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేయగా… వైరల్ అవుతుంది. నెటిజెన్స్ వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కొందరేమో ట్రోల్ చేస్తున్నారు. నటుడు నరేష్ గతంలో మూడు వివాహాలు చేసుకున్నారు. ఆయన మూడో వైఫ్ రమ్య రఘుపతితో వివాదాలు కొనసాగుతున్నాయి. పవిత్ర లోకేష్ తో నరేష్ బంధాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. నాకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళకు ఆయన ఎలా దగ్గరవుతారని ఆమె ప్రశ్నిస్తున్నారు.

సడన్ గా నరేష్ పెళ్లి ప్రకటన చేయడంతో రమ్య రఘుపతితో ఆయనకు విడాకులు మంజూరు అయ్యాయని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ హాట్ టాపిక్స్ గా నరేష్-పవిత్ర లోకేష్ ఎపిసోడ్ నడిచింది. పవిత్ర లోకేష్ తో పాటు నరేష్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ ని ఆయన వివాహం చేసుకున్నారనే కథనాలు వెలువడ్డాయి. మీడియా కథనాలకు నరేష్ స్పందించారు. ఆయన ఒక వివరణ ఇవ్వడం జరిగింది.
పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. మేము కలిసి జీవిస్తున్నాం. వివాహ వ్యవస్థపై నాకు విశ్వాసం లేదు. పెళ్లి చేసుకున్న పది జంటల్లో ఎనిమిది మంది విడిపోతున్నారు. కలిసి జీవించడానికి వివాహం కేవలం లైసెన్స్ మాత్రమే. ఒక నమ్మకమైన, అభిమానించే, ప్రేమించే వ్యక్తి తోడు కావాలి అనుకున్నాను. అందుకే పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్నాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్ లో చేసుకుంటానేమో చెప్పలేను అన్నారు.

నేడు ఆయన పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఆ మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. తమ ఇద్దరి వాస్తవ జీవితాల ఆధారంగా మూవీ నిర్మిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. నరేష్ విడుదల చేసిన వీడియో అందులో భాగమా అనే సందేహాలు కలుగుతున్నాయి. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని నరేష్ చెప్పిన తరుణంలో ఈ సందేహాలు కలుగుతున్నాయి. అలాగే చట్టబద్ధంగా రమ్య రఘుపతితో విడాకులు తీసుకోకుండా పవిత్ర మెడలో తాళి కట్టడం కుదరదు. కాగా నరేష్ కి పెళ్లీడుకొచ్చిన నవీన్ విజయ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. ఆయన హీరోగా ఓ మూవీ చేశాడు.
https://twitter.com/ItsActorNaresh/status/1609067421507407873?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1609067421507407873%7Ctwgr%5Ec0e6013586fc8ce7d234dfcc08b0e139eab21957%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-2514350410212065103.ampproject.net%2F2211302304002%2Fframe.html