Homeట్రెండింగ్ న్యూస్Ranganathaswamy Temple: ప్రపంచంలో అతిపెద్ద రంగనాథ స్వామి గుడి.. ఎక్కడుందో తెలుసా?

Ranganathaswamy Temple: ప్రపంచంలో అతిపెద్ద రంగనాథ స్వామి గుడి.. ఎక్కడుందో తెలుసా?

Ranganathaswamy Temple: ప్రపంచ వ్యాప్తంగా రంగనాథస్వామి ఆలయాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచంలో అతిపెద్ద రంగనాథస్వామి ఆలయం మాత్రం మన తమిళనాడులో ఉంది. తిరుచనాపల్లి జిల్లాలోని శ్రీరంగం అనే గ్రామంలో దీనిని నిర్మించారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

19వ శతాబ్దంలో..
ఈ రంగనాథస్వామి ఆలయాన్ని 19వ శతాబ్దంలో 156 ఎకరాల్లో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణు అవతారమైన శ్రీరంగనాథుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు. వెయ్యేళ్ల క్రితం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేరి రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడింది. ఎంతో మంది భక్తి విశ్వాసాలకు ప్రతీరూపం ఈ ఆలయం.

ప్రపంచంలో ఎతైన టవర్‌..
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన టెంపుల్‌ టవర్స్‌ ఉన్న ఆలయం కూడా శ్రీరంగనాథ స్వామి ఆలయమే. ఈ ఆలయ రాజగోపురం 236 ఫీట్ల ఎత్తు ఉన్న ఇండియా గేట్‌ కన్నా మరో వంద ఫీట్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది. అంటే 336 ఫీట్లు ఉంటుంది.

ఏడు ఎంక్లూజర్స్‌..
శ్రీరంగనాథ ఆలయానికి ఏడు ఎంక్లూజర్స్‌ ఉన్నాయి. ఏడు ఎంక్లూజర్స్‌ ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదే. లోపల ఐదు ఎంక్లూజర్స్‌లో ఆలయం ఉండగా, బయట ఉన్న రెండు ఎంక్లూజర్స్‌లో 40 వేల మంది నివసిస్తున్నారు. ఇందులో ధాన్యాగారాలు, 12 కోనేరులు, ఉన్నాయి.

24 రోజులు ఉత్సవాలు..
ఇక శ్రీరంగనాథ ఆలయంలో ఏడాదికి 24 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు 10 లక్షలకుపైగా భక్తులు వస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version