Jabardasth Varsha: వర్ష, ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ జంటగా వీరికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రకరకాల స్కిట్లతో వీరు ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈటీవీలో రష్మీ- సుధీర్ తర్వాత అంతటి క్రేజ్ వీరిద్దరి సొంతం. అయితే కొద్దిరోజులుగా వర్ష, ఇమ్మాన్యుయెల్ రిలేషన్ లో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పెళ్లికూడా చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిని వర్ష, ఇమ్మాన్యుయెల్ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. మీడియా ఎప్పుడైనా ప్రశ్న అడిగితే వర్ష, ఇమ్మాన్యుయెల్ దాటవేస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఏముందనే విషయాన్ని ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న వర్ష వెల్లడించారు.
“ఇమ్మాన్యుయెల్ తో పెళ్లి ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు? నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి..ఇమ్మాన్యుయెల్ నాతో పనిచేసే ఆర్టిస్ట్ కాబట్టి.. క్లోజ్ గా ఉంటే అలా రాస్తారా? పెళ్లి ఎప్పుడు అని అడుగుతారా? అసలు నేను అతడిని పెళ్లి చేసుకునే విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలి? అతనితో వివాహం జరిగిన జరగకపోయినా షో ల్లో నటిస్తూనే ఉంటాను. నాకు నటన తప్ప మరోటి రాదు. చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నాతోపాటు నటించే ఆర్టిస్టులతో క్లోజ్ గా ఉంటే అదే అవుతుందా? ఇమాన్యుయల్ తో నా కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే మీడియా మా మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఏది ఏమైనప్పటికీ అభిమానులు నాకు అండగా ఉండాలి. వారు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారానే ఇక్కడి దాకా వచ్చాను” అంటూ వర్ష వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో వర్ష బిగ్ బాస్ షో లో తనకు వచ్చిన ఆఫర్ గురించి కూడా ప్రకటించింది..” నన్ను బిగ్ బాస్ షోలో చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కాకపోతే నేను చాలా సెటిల్డ్ రకం..ఎవరి తోనూ గొడవలు పెట్టుకోను. అలా గొడవలు పెట్టుకుంటే తర్వాత వారితో మాట్లాడడం ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా నాకు వంట చేయడం రాదు. వంట చేయడం రాకపోతే బిగ్ బాస్ షోలో గేలి చేస్తారు. అందుకే అందులోకి వెళ్ళలేదు. అయితే వచ్చే సీజన్లో అందులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మొన్నటిదాకా కొన్ని సీరియల్స్ లో నటించాను. ఇప్పుడిక అందులో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను. కేవలం షో స్ మాత్రమే చేస్తాను. ఇమాన్యుయేల్ తో వివాహం జరిగినా, జరగకపోయినా నేను నటిస్తున్న షో స్ చూడండి. ఎందుకంటే అభిమానుల వల్లే ఇక్కడి దాకా వచ్చాను.” అని వర్ష పేర్కొంది. మొత్తానికి తనకు ఇమాన్యుయల్ కు ఏం ఉందో, ఆ రిలేషన్ ఎక్కడిదాకా కొనసాగుతుందో వర్ష తన వ్యాఖ్యల ద్వారా బయటపెట్టింది. ఇక ఇప్పటికైనా మీడియా ఆ రూమర్లకు చెక్ పెడుతుందో చూడాలి.