
Illegal Affair: వివాహేతర సంబంధాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అన్యోన్యమైన కాపురాల్లో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ఉన్న దాంట్లో తృప్తి పడక కొత్త సుఖం కోసం వెంపర్లాడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సామాజిక హద్దులు దాటుతూ తమ సుఖం కోసం తాపత్రయ పడుతున్నారు. అయినా సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. కొద్ది రోజులు గడవగానే పూట గడవక ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. దీంతో హద్దులు దాటిన ప్రేమలతో ఎంజాయ్ మెంట్ పేరుతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. సంసారాలు విడిపోయినా వారు ఆనందంగా ఉంటున్నారా? లేదనే సమాధానాలే వస్తున్నాయి.
తాజాగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కుళచల్ కడియపట్నం గ్రామంలో రాజేష్, షామిని జంట ఉంటున్నారు. వీరికి పెళ్లయి చాలా రోజులైనా వారి కుటుంబం సాఫీగానే సాగింది. కొన్నేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతింది. ఇక భార్య భర్తతో ఉండలేక పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె సాయినాథ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అదే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలియకుండా కొద్ది రోజులు వారి ప్రేమాయణం సాగింది.
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు వస్తూ ఆమెతో ఎంజాయ్ చేస్తూ వెళ్తుండేవాడు. కొద్ది రోజుల తరువాత విషయం భర్తకు తెలియడంతో నిలదీశాడు. తరువాత మళ్లీ ఆమె పుట్టింటికి చేరింది. ఈనెల 18న షామిని ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి కారులో పారిపోయింది. డబ్బు తీసుకుని వెళ్లడంతో అది అయిపోయే వరకు ఎంజాయ్ చేశారు. డబ్బు అయిపోయాక ఏం చేయాలో పాలుపోలేదు. సుఖం కోసం డబ్బులు ఉన్నన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ చేతిలో పైసలు అయిపోయాక పరిస్థితి అర్థమైంది.

డబ్బు సంపాదించే మార్గం లేకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలను కారులో పడుకోబెట్టి ఇద్దరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లలను కాపాడారు. వారి మృతదేహాలను పోస్టు మార్టంకు పంపించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల కోణంలో దిక్కులేకుండా ప్రాణాలు తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను నాశనం చేసిందని అందరు కామెంట్లు చేస్తున్నారు.