
Earthquake Turkey: టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసింది. ఏడాదిలో చాలా సార్లు భూకంపాలు వస్తాయి. కానీ గత వందేళ్లలో రాని ప్రళయం ఈ సారి పలకరించింది. ప్రజలను అతలాకుతలం చేసింది. 2020లో 33 వేల సార్లు కంపించింది. అందులో 332 సార్లు 4.0 కంటే ఎక్కువ తీవ్రత కనిపించింది. కానీ ఈసారి మాత్రం రిక్టర్ స్కేలుపై తీవ్రత నమోదు కావడంతో భవనాలు నేటమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీ భూకంప జోన్ లో ఉండటం గమనార్హం. అందుకే అక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి.
ప్రమాకర జోన్ లో..
టర్కీలో ఎక్కువ భాగం ఫలకాలు ప్రమాదకరంగా ఉన్నాయి. యురేషియన్, ఆఫ్రికన్, అరేబియన్ ప్రాంతాల్లో ఇలాంటి ఫలకాలు ఉండటంతో భూకంపాలు తరచుగా వస్తున్నాయి. అణుబాంబులు వేసినప్పటి కంటే తీవ్రమైన నష్టం దీంతో జరుగుతుంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో తీవ్ర నష్టం జరిగింది. రిక్టర్ స్కేలుపై 4 అంతకంటే ఎక్కువ తీవ్రతతో దాదాపు వందసార్లు కంపించింది. ఇంతటి నష్టం మాత్రం ఇప్పుడే సంభవించింది.
18 కిలోమీటర్ల దూరంలోనే..
టర్కీలో 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రం ఉపరితలానికి దగ్గరగా ఉండటంతో భారీ నష్టం కలిగింది. 1939 డిసెంబర్లో రిక్టర్ స్కేలుపై 8 గా నమోదైంది. దీని దెబ్బకు ఇరవై వేల మంది అసువులు బాశారు. 1,16,720 ఇళ్లు నేలమట్టం అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. తరువాత అంత స్థాయిలో భూకంపం రావడం ఇదే. ప్రస్తుతం ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది క్షతగాత్రులుగా మారారు. వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

అణుబాంబులకంటే ప్రమాదకరం
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై వేసిన బాంబుల కంటే ఏడు రెట్లు తీవ్రతతో భూకంపం రావడంతో 32 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. దీని తీవ్రతకు టర్కీ అతలాకుతలం అయింది. ఎటు చూసినా హాహాకారాలే. ప్రకృతి విలయానికి టర్కీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇంత భారీ మొత్తంలో సంభవించిన నష్టానికి చాలా దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మన దేశం కూడా టర్కీని ఆదుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది.