
Mulugu District: సమాజంలో గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. ఇంజినీర్‌ను అయినా, డాక్టర్‌ను అయినా, సైంటిస్టును అయినా తయారు చేసే శక్తి గురువుకే ఉంటుంది. అయితే అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన గురువులు గాడితప్పుతున్నారు. తప్పుడు పనులు చేస్తూ తన్నులు తింటున్నారు. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన గాడి తప్పుతున్న గురువులకు ఓ నిదర్శనం..
సహోపాధ్యాయురాలితో రాసలీలలు..
విద్యాబుద్ధులు నేర్పే ఇద్దరు గురువులు దారి తప్పారు. వివాహేతర సంబంధం నెరుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, తన సహోపాధ్యాయురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. దీంతో వీరి వివాహేతర సంబంధానికి అడ్డుచెప్పేవారు లేకుండా పోయారు.
ఆలస్యంగా తెలుసుకున్న భర్త..
ఇద్దరు ఉపాధ్యాయులది ఒకే స్కూల్ కావడం, వివాహేతర సంబంధాన్ని ఎంజాయ్ చేస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న భర్త ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఉపాధ్యాయురాలిని జనవరిలో మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.
అయినా తీరు మారలేదు..
వివాహేతర సంబంధంపై తన భర్తకు అనుమానం వచ్చిందని తెలిసి కూడా సదరు ఉపాధ్యాయురాలు తన బుద్ధి మార్చుకోలేదు. సహోపాధ్యాయుడి సాన్నిహిత్యాన్నే కోరుకుంది. భర్త జిల్లా కేంద్రంలోనే ఉంటుండంతో వీలైనప్పుడల్లా ఉపాధ్యాయులు కలుస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలి భర్త ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు వేములవాడకు బందోబస్తు కోసం వెళ్లి ఆదివారం వరకు అక్కడే ఉన్నాడు. ఆయనకు సోమవారం హాలీడే రావడంతో భార్య, కూతురిని చూసేందుకు మంగపేటకు వచ్చాడు. ఈ క్రమంలో నాగేందర్ తనతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఉపాధ్యాయురాలికి రాత్రి ఫోన్ చేశాడు. ఆ కాల్‌ను ఆమె భర్త లిఫ్ట్ చేశాడు.

టీచరే ఫోన్ లిఫ్ట్ చేసిందనుకుని..
అయితే కానిస్టేబల్ ఏమీ మాట్లాడక ముందే.. నాగేందర్ ‘నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచు’ అని చెప్పి ఫోన్ కట్‌చేశాడు. అనుమానం వచ్చిన ఉపాధ్యాయురాలి భర్త భార్యకు ఈ విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి.. ముందు తలుపులు తీసి ఉంచాడు. తాను బాత్రూంలో ఉండి నాగేందర్ రాకను గమనించాడు. ఉపాధ్యాయుడు రాత్రి ఇంటికి వచ్చి లోపలికి వెళ్లగానే బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం కొత్తగూడ మండలంలోని బంధువులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం నాగేందర్‌తోపాటు తన భార్యకు దేహశుద్ధి చేశాడు. నాగేందర్‌ను ఇంటిముందు రాత్రంతా తాళ్లతో కట్టేశాడు. తెల్లవారాక మండల కేంద్రంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.
దారితప్పిన ఇద్దరు ఉపాధ్యాయులు తమ పరువు పోగొట్టుకోవడంతోపాటు రెండు కుటుంబాల్లో చిచ్చు రేపారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.