Homeఆంధ్రప్రదేశ్‌Muthyalareddypally: బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్న ఎస్సై తల్లి, తమ్ముడు అరెస్ట్‌!

Muthyalareddypally: బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్న ఎస్సై తల్లి, తమ్ముడు అరెస్ట్‌!

Muthyalareddypally
Muthyalareddypally

Muthyalareddypally: కొడుకు లేదా కూతురు ఎస్సై అయితే తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు. కొంతమంది వారి పేరు చెప్పి చిన్నచిన్న సెటిల్‌మెంట్లు చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఎస్సై తల్లి ఏకంగా బ్రోతల్‌ హౌస్‌ నడుపుతోంది. స్థానికుల సమాచారంతో ఆ ఇంటిపై దాడిచేసిన పోలీసులు నిర్వాహకురాలు ఎస్సై తల్లి అని తెలియడంతో స్టన్‌ అయ్యారు.

తిరుపతిలో ఘటన..
తిరుపతి ముత్యాలరెడ్డిపల్లిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందడంతో పోలీసులు హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఓ మహిళ, ఇద్దరు పురషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వారి గురించి ఆరా తీయగా మహిళ ఓ మహిళా ఎస్సై తల్లని పట్టుబడిన పురుషుల్లో ఒకరు మహిళా ఎస్సై తమ్ముడని తేలింది. ఇంకో వ్యక్తి విటుడని గుర్తించారు. తల్లి, తమ్ముడితోపాటు విటుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇద్దరు యువతులను హోమ్‌కు తరలించారు.

Muthyalareddypally
Muthyalareddypally

ఏడాది క్రితమే మహిళా ఎస్సైకి మ్యారేజ్‌..
ఆ మహిళా ఎస్సైకి ఏడాది క్రితమే వివాహం అయింది. దీంతో ఆమె భర్తతో కలిసి మరో చోట ఉంటుంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో కూతురు ఎస్సై కాబట్టి ఎవరికీ అనుమానం రాదని, తమను ఎవరూ ఏమీ అనరని భావించినట్లు ఉన్నారు. ఏకంగా బ్రోతల్‌ హౌస్‌ ఓపెన్‌ చేశారు. పరువు తక్కువ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. కేసును పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version