Cinematographer
Cinematographer: ఎంత ప్రతిభ ఉన్నా గుణం గుడిసేటిది అయితే ఏం లాభం. ఓ స్టార్ సినిమాటోగ్రాఫర్ తన బలహీనత కారణంగా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. అమ్మాయిల పిచ్చితో పరువు పోగొట్టుకుంటున్నారట. ఈ తమిళ సినిమాటోగ్రాఫర్ తీరు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. టాలెంట్ ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడం తెలుగు పరిశ్రమకు అలవాటు. నాణ్యమైన చిత్రాలు తెరకెక్కించేందుకు ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులను, నటులను ఇతర పరిశ్రమల నుండి అరువు తెచ్చుకుంటారు.
కొన్నాళ్లుగా ఓ తమిళ సినిమాటోగ్రాఫర్ టాలీవుడ్ లో పెద్ద చిత్రాలకు పని చేస్తున్నాడు. అయితే ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారిందట. ఆడవాళ్ళ బలహీనత కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారట. సినిమా బడ్జెట్ అనుకున్న దానికి మించి పోతుందట. సెట్స్ లో ఆడవాళ్ళతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాడట. మొబైల్స్ కి అసభ్యకర సందేశాలు పంపుతున్నారట. ఆయన మీద ఫిర్యాదులు ఎక్కువైపోయాయట.
Cinematographer
దానికి తోడు హైదరాబాద్ లో ఉన్నత కాలం ఫైవ్ స్టార్ హోటల్ లో విడిది డిమాండ్ చేస్తాడట. తన హోటల్ రూమ్ కి అమ్మాయిలను పిలిపోయించుకోవడం పరిపాటిగా మారిందట. ఆయన దిగజారుడు ప్రవర్తనతో నిర్మాతలు విసిగిపోతున్నారట. దీంతో తమ సినిమాల మధ్యలో నుండి ఆయన్ని తప్పించి, మరొకరిని తీసుకుంటున్నారట.
ఇటీవల నాలుగు బడా ప్రాజెక్ట్ నుండి ఈ సినిమాటోగ్రాఫర్ ని తప్పించారట. ఆ నాలుగు చిత్రాల్లో ఇటీవల విడుదలైన ఓ మూవీ డిజాస్టర్ గా నిలిచిందని సమాచారం. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ కి మించి క్రమశిక్షణ అవసరం. అది లేని ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అటు కెరీర్ ఇటు గౌరవం పోగొట్టుకుంటున్నాడట. నిర్మాతలు ఆయనంటే భయపడుతున్నారట. దురలవాట్లతో కెరీర్ ని రిస్క్ లో పడేసుకుంటున్నాడని టాక్.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: The star cameraman is causing trouble for the producers with the madness of the girls
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com