ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఊహించని వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వల్ల ఎక్కడో జరిగిన ఆ ఘటనలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. తాజాగా ఒక సాలీడు పురుగు పక్షిని మింగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడైనా సాలీడు పురుగు పక్షిని మింగడం సాధ్యమవుతుందా…? అంటే చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు కాదనే చెబుతారు.
Also Read : కరోనా ఓటు వేసే విధానాన్నే మార్చబోతుందా..?
అయితే ఒక సాలీడు మాత్రం పక్షిని మింగడం సాధ్యమేనని నిరూపించింది. సాధారణంగా సాలీడు ఆహారంగా చిన్నచిన్న పురుగులను, వానపాములను ఆహారంగా తీసుకుంటుంది. సాలీడు పక్షిని తినాలని ప్రయత్నించగా ఆకారంలో సాలీడుతో పోలిస్తే పక్షి చాలా రెట్లు పెద్దది కావడంతో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అయితే ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో సరైన సమాచారం లేదు కానీ ఒక సాలీడు మాత్రం పెద్ద పక్షిని తినేసింది.
https://twitter.com/AmazingScaryVid/status/1307369348978208768
సాధారణ సాలీడులతో పోలిస్తే ఈ సాలీడు పెద్ద సైజులో ఉండటంతో ఈ సాలీడుకు పక్షిని తినడం సులభంగానే సాధ్యమైంది. సాలీడు పక్షిని నోటికి కరిపించుకుని వేగంగా మింగడానికి ప్రయత్నం చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భయాందోళనకు గురవుతుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం ఈ సాలెపురుగు అప్ డేటెడ్ సాలెపురుగు అని చెబుతున్నారు.
నెటిజన్లు సోషల్ మీడియాలో అంత బరువైన పక్షిని సాలీడు ఎలా పట్టుకుందని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం సాలీడు చనిపోయిన పక్షిని పట్టుకుని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. నేచర్ ఈజ్ స్కేరీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయబడింది. దక్షిణ అమెరికాలో ఇలంటి సాలీళ్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం.
Also Read : యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్ అరెస్ట్