ఉత్తరాంధ్రపై ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు… ఫలితం శూన్యమే..?

చంద్రబాబు అనగానే రాజకీయ చాణిక్యుడు, అపర మేధావి అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని సొంతం చేసుకున్నాడని కొందరు కామెంట్లు చేసినా చంద్రబాబును అభిమానించే వాళ్లకు కొదువే లేదు. అయితే అంతటి అపరమేధావి ఎంత గొప్ప ప్రణాళికలు వేసినా నిరాశాజనకమైన ఫలితాలే ఎదురవుతున్నాయి. చంద్రబాబు ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలే తప్ప అనుకూల ఫలితాలు రావడం లేదు. Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..? దీంతో […]

Written By: Navya, Updated On : September 23, 2020 10:56 am
Follow us on

చంద్రబాబు అనగానే రాజకీయ చాణిక్యుడు, అపర మేధావి అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని సొంతం చేసుకున్నాడని కొందరు కామెంట్లు చేసినా చంద్రబాబును అభిమానించే వాళ్లకు కొదువే లేదు. అయితే అంతటి అపరమేధావి ఎంత గొప్ప ప్రణాళికలు వేసినా నిరాశాజనకమైన ఫలితాలే ఎదురవుతున్నాయి. చంద్రబాబు ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలే తప్ప అనుకూల ఫలితాలు రావడం లేదు.

Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..?

దీంతో చంద్రబాబు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో ఐదు రోజుల్లో చంద్రబాబు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. చంద్రబాబు ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తును పూర్తి చేశాడని పార్టీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కళా వెంకట్రావు టీడీపీ అధ్యక్షుని స్థానంలో ఉండగా ఆయన స్థానంలో అచ్చెన్నాయుడు కొత్తగా నియమితులు కానున్నారు.

అయితే అచ్చెన్న నియామకం వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. చంద్రబాబు మూడు రాజధానులకు మద్దతు పలకకుండా అమరావతికే మద్దతు పలుకుతుండటంతో విశాఖ వాసుల్లో టీడీపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. ఉత్తరాంధ్రలో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఆ ప్రాంతం ఎమ్మెల్యే తాజాగా వైసీపీకి మద్దతు ఇచ్చారు.

అయితే అచ్చెన్న కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ.ఎస్.ఐ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి నేతకు పదవి ఇవ్వడంపై పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కళా వెంకట్రావు ఉత్తరాంధ్ర బీసీ నేత కాగా అచ్చెన్నాయుడు కూడా ఉత్తరాంధ్ర బీసీ నేత కావడం గమనార్హం. దీంతో కళా వెంకట్రావు పదవిలోకి అచ్చెన్నాయుడు వచ్చినా పెద్దగా మార్పు ఉండదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు ప్రవరిస్తున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పాలి.

Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?