Homeట్రెండింగ్ న్యూస్Uttarpradesh : ఆ రైలు వేగం 110 కి.మీలు.. జారిపడ్డ ప్రయాణికుడి వీడియో వైరల్

Uttarpradesh : ఆ రైలు వేగం 110 కి.మీలు.. జారిపడ్డ ప్రయాణికుడి వీడియో వైరల్

Uttarpradesh : సాధారణంగా కదులుతున్న రైలు నుంచి దిగేందుకు భయపడతాం. ఎంతో అలవాటు ఉన్నవారు కానీ కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫారంపై అడుగు పెట్టలేరు. ఒక్కోసారి ఇలా దిగే క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది క్షతగాత్రులవుతుంటారు. అవయవాలు కోల్పోతుంటారు. కానీ 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలు నుంచి ఓ యువకుడు జారిపడ్డాడు. ప్లాట్ ఫారమ్ పై పడిన సదరు యువకుడి రైలుకంటే వేగంగా దొర్లుకుంటూ ఓ స్తంభానికి ఢీకొట్టి ఆగాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు భయం గొల్పుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ రైల్వేస్టేషన్ లో పాటలీపుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఆ స్టేషన్ లో రైలుకు స్టాప్ లేదు. ఈ తరుణంలో ఓ యువకుడు ప్లాట్ ఫారంపై జారిపడ్డాడు. రైలు వేగంతో సమానంగా 100 మీటర్ల మేర దొర్లుకుంటూ వెళ్లాడు. పొరపాటున ట్రాక్ వైపు దూసుకొచ్చి ఉంటే తునతునకలయ్యేవాడు. కానీ ప్లాట్ ఫారం మీదనే అలా దొర్లుతూ చివరకు స్తంభం అడ్డం వచ్చేసరికి ఓ చోట నిలిచిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో రైలులో ప్రయాణికులతో పాటు ప్లాట్ ఫారంపై ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు.
స్టేషన్లో ఉన్నవారు ఆ యువకుడు చనిపోయి ఉంటాడని భావించారు. సపర్యలు చేసేందుకు పరుగుపరుగున వెళ్లగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ యువకుడు తనంతట తానుగా కూర్చోవడమే కాకుండా… కొద్ది నిమిషాలకే లేచి నిలబడ్డాడు. తన లగేజీ చూసుకున్నాడు. ఆయన ఒంటిపై ఎటువంటి గాయమూ లేదు. ఎక్కడ చిన్నపాటి దెబ్బ కూడా కనిపించలేదు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. స్టేషన్లో ఉండే సీసీ పూటేజీల్లో ఈ గగుర్పాటు దృశ్యాలు రికార్డయ్యాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృత్యుంజయుడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

YouTube video player

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version