Pawan Kalyan OG Movie: ఆగస్టు తో పవన్ కళ్యాణ్ OG మూవీ షూటింగ్ పూర్తి.. ఇంత ఫాస్ట్ ఏంటి గురూ!

జులై వరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అక్కడితో పవన్ కళ్యాణ్ లేని షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యినట్టే, ఆ తర్వాత ఆగస్టు నెలలో పవన్ కళ్యాణ్ కేవలం 10 నుండి 15 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేస్తే సినిమా మొత్తం పూర్తి అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలు పూర్తి చేసి , డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : June 21, 2023 3:25 pm

Pawan Kalyan OG Movie

Follow us on

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం #OG. ‘రన్ రాజా రన్’ మరియు ‘సాహూ’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ , ఇప్పుడు వారాహి టూర్ లో బిజీ గా ఉన్నాడు.

అయితే ఆయన అందుబాటులో లేకపోయినా కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా ఎంపిక అయిన ఇమ్రాన్ హష్మీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆయన మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ తో పాటుగా శ్రియ రెడ్డి, అరుణ్ దాస్ , కిక్ శ్యామ్ తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

జులై వరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అక్కడితో పవన్ కళ్యాణ్ లేని షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యినట్టే, ఆ తర్వాత ఆగస్టు నెలలో పవన్ కళ్యాణ్ కేవలం 10 నుండి 15 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేస్తే సినిమా మొత్తం పూర్తి అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలు పూర్తి చేసి , డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక ల్యాండ్ మార్క్ చిత్రం గా తీర్చిదిద్దెందుకు అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా ఇందులో పని చేసే నటీనటులు ఈ సినిమా స్క్రిప్ట్ విని పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. అభిమానులు ఈ చిత్రం మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా తక్కువ అట, ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్, చూడాలి మరి.