Meenakumari: తెలుగు టీవీ తెరపై సంచలనం సృష్టించిన అంతరంగాలు సీరియల్ గురించి ఎవరూ మరిచిపోరు. ఆధునిక సీరియళ్లకు భీజం నాటిన ఈ ధారావాహిక అప్పట్లో సంచలనం సృష్టించింది. రామోజీరావు నిర్మాణంలో వచ్చిన ఈ సీరియల్ కు అక్కినేని వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు. అంతరంగాలు సాంగ్ ను సాలూరు వాసూరావు కంపోస్ చేయగా.. బాలసుబ్రహ్మణ్యం పాట పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు. కుటుంబ నేపథ్యంలో సాగిన ఈ ధారావాహిక 1998లో 5 నంది పురస్కారాలను గెలుచుకుంది. ఈ సీరియల్ లో శరత్ బాబుతో పాటు అచ్చుత్, కిన్నెర, కల్పన, అశ్వినితో పాటు మీనా కుమారి నటించింది. ఈమె ప్రస్తుతం ఎలా మారిందో చూసి అంతా షాక్ అవుతున్నారు.
మీనాకుమారి అచ్చ తెలుగు అమ్మాయి. ఏపీలోని రాజమండ్రిలో 1981 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు హైదరబాద్ కు వచ్చారు. పదో తరగతి పూర్తయిన తరువాత ఈమె చెన్నై వెళ్లాల్సి వచ్చింది. మీనా కుమారి చిన్నప్పుడే అందంగా ఉండడంతో ఆమెను సినిమాల్లోకి వెళ్లాలని కొందరు ప్రోత్సహించేవారు. అయితే ఆమె పిన్న కూతురు సినిమాటోగ్రాఫర్ కావడంతో అమెకు ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది.
అలా గుర్తింపు తెచ్చుకున్న మీనా కుమారి ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతరంగాలు సీరియల్ లో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. దీంతో ఆమె వెండితెరపై కూడా మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకుందాం.. కలిసుందాం రా.. అనే సినిమాల్లో నటించింది. అయితే కొన్నాళ్లా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా కుమారి తిరిగి బుల్లితెరపై అడుగుపెట్టింది.
తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే ‘మా వారు మాస్టారు’ అనే సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మీనా కుమారి ఏజ్ బార్ అయిన మహిళగా కనిపిస్తారు. అచ్చతెలుగు అమ్మాయిలా.. అందం దారపోసినట్లుగా ఉండే మీనా కుమారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాను చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.