https://oktelugu.com/

తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాల్లో మెజారిటీ తెలుగు సినిమాలు రివేంజ్ స్టోరీలతోనే తెరకెక్కుతాయి. హీరో పెద్దైన తర్వాత విలన్ ను చంపేసే సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. అయితే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా..? నిజంగా సంవత్సరాల తరబడి హత్య చేసిన వ్యక్తి కోసం వెతుకుతారా..? అనే ప్రశ్నలు వినిపిస్తే సాధారణంగా ఎవరైనా కాదనే సమాధానం చెబుతాం. Also Read : దేశ ప్రజలకు శుభవార్త… ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..! అయితే ఒక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 25, 2020 / 11:08 AM IST
    Follow us on

    సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాల్లో మెజారిటీ తెలుగు సినిమాలు రివేంజ్ స్టోరీలతోనే తెరకెక్కుతాయి. హీరో పెద్దైన తర్వాత విలన్ ను చంపేసే సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. అయితే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా..? నిజంగా సంవత్సరాల తరబడి హత్య చేసిన వ్యక్తి కోసం వెతుకుతారా..? అనే ప్రశ్నలు వినిపిస్తే సాధారణంగా ఎవరైనా కాదనే సమాధానం చెబుతాం.

    Also Read : దేశ ప్రజలకు శుభవార్త… ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

    అయితే ఒక వ్యక్తి మాత్రం తండ్రిని చంపిన వ్యక్తి కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. సినిమాను తలపించే ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే చైనా దేశంలోని చంగ్ బా అనే పట్టణంలో జియాంగ్ మింగ్కియాన్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. జియాంగ్ చేసిన చిన్న తప్పు వల్ల అతని తండ్రి జియాంగ్ కు 9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చనిపోయాడు.

    జియాంగ్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో అతనికి జాంగ్ జున్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఆట ఆడే సమయంలో జియాంగ్, జాంగ్ జున్ మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ చినికిచినికి గాలి వానలా మారి ఇద్దరి కుటుంబాలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అలా గొడవ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కరెంట్ పోయింది. ఆ సమయంలో జియాంగ్ తండ్రి జియాంగ్ వెంజిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు.

    ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు జిన్ సోదరుడు మౌకీ పారిపోయాడు. దీంతో మౌకీ హత్య చేసి ఉండవచ్చని జియాంగ్ అనుమానించాడు. ఆ తరువాత మౌకీ కోసం తన స్నేహితులు, బంధువులు ఇచ్చిన సమాచారం ద్వారా జియాంగ్ వెతికాడు. అయితే అతనికి సానుకూల ఫలితం దక్కలేదు. అలా 17 సంవత్సరాలు వెతికి మౌకీ గురించి ఖచ్చితమైన సమాచారం లభించడంతో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి జియాంగ్ అతనిని పట్టుకున్నాడు.

    అనంతరం పోలీసులకు మౌకీ గురించి చెప్పి అరెస్ట్ చేయించాడు. మోకీకి శిక్ష వేయించి పంతం నెగ్గించుకున్న జియాంగ్ ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు.

    Also Read : టీడీపీకి షాక్‌ తగలనుందా..?