ఈరోజుల్లో డబ్బు మనిషి జీవితంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదంకెల జీతం సంపాదించే వాళ్లు కూడా నెలాఖరుకు అప్పుల పాలు కావాల్సి వస్తోంది. ఏ వస్తువైనా కొనాలంటే ఈఎంఐలపై ఆధారపడి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
Also Read : దేశ ప్రజలకు శుభవార్త… ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!
అయితే సరైన పద్ధతిలో సేవింగ్ చేయడం ద్వారా డబ్బును సులువుగా ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటే సులువుగా డబ్బు పొదుపు చేయవచ్చని.. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా ఇతర పాలసీలతో పోలిస్తే ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు. తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించి దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడులను పొందవచ్చని తెలుపుతున్నారు.
18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. లక్ష రూపాయల నుంచి గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. 15 నుంచి 35 ఏళ్ల పాటు టర్మ్ ఉన్న ఈ పాలసీ తీసుకున్న వారికి 15 లక్షల రూపాయల రిస్క్ కవర్ సౌలభ్యం కూడా ఉంటుంది. ఉదాహరణలు 29 సంవత్సరాల వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాడని అనుకుందాం.
పాలసీ టర్మ్ 33 సంవత్సరాలకు ఎంచుకుని 15 లక్షల రూపాయల మొత్తానికి పాలసీ తీసుకుంటే ఆ వ్యక్తి రోజుకు 128 రూపాయల చొప్పున వార్షిక ప్రీమియం 46,800 రూపాయలు చెల్లించాలి. అతనికి మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, 24 లక్షల రూపాయలు, అంతిమ అదనపు బోనస్ కింద 27 లక్షల రూపాయలు పొందవచ్చు. అంటే బోమా డబ్బు, బోనస్, అంతిమ బోనస్ కలిపి 66 లక్షల రూపాయలు చేతికి వస్తాయి.
Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?