మారుతున్న కాలంతో పాటే మనుషుల ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. మనుషులు హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ హోం డెలివరీ చేస్తుండటంతో ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడానికి మొగ్గు చూపుతున్నారు. మహిళలు, పురుషులు ఇద్దరూ జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. వైద్యులు జంక్ ఫుడ్ మంచిది కాదని చెబుతున్నా వారి సూచనలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
Also Read : వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే..
ముఖ్యంగా జంక్ ఫుడ్ తినే మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో లిపిడ్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది రుచిగా ఉండటం, తక్కువ సమయంలో తయారయ్యే ఫుడ్ కావడంతో జంక్ ఫుడ్ పై ఆకర్షితులవుతున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం జంక్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళలకు సంతానం తక్కువగా కలుగుతోందని వెల్లడవుతోంది. వివిధ దేశాలకు చెందిన సంతానం కలగని 5,000 మంది మహిళలపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. త్వరగా సంతానం కలగానుకునేవారు పండ్లు ఎక్కువగా తినాలని ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
కూరగాయలు, చేపలు కూడా గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చాట్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్, ఫ్రైడ్ ఐటెమ్స్, పిజ్జాలు, బర్గర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. మహిళలు మద్యం తాగినా, ధూమపానం చేసినా ఆ అలవాట్లు కూడా సంతాన సమస్యలకు కారణం అవుతాయని అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు.
Also Read : పానీపూరీ తింటే ప్రాణం పోయింది… ఎలా అంటే..?