Snake Viral Video: కాలం మారుతున్న కొద్దీ వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భూమ్మీద మనుషులతో పాటు ఎన్నో జీవరాశులు కొనసాగుతున్నాయి. విభిన్న జాతుల జంతువులు తమ మనుగడ సాధించడానికి నిత్యం పోరాటం సాగిస్తాయి. తమ జాతి జంతువుపై వేరే జాతికి సంబంధించినవి వచ్చినప్పుడు ఎదురుదాడికి దిగుతూ ఉంటాయి. ఇలాంటివి మనం టీవీల్లో మాత్రమే చూశాం. కానీ రియల్ గా జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యం వేస్తుంటాయి. కీటకాల్లో అతి భయంకరమైనది పాము. ఇది కాటు వేయడం వల్ల మనుషులు త్వరగా చనిపోతారు. అయితే పాముకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ప్రపంచమంతా 2,900 పాముల జాతులను గుర్తించారు. అంటార్కిటికాలోని మినహా ప్రపంచమంతా ఈ భూచరాలు విస్తరించి ఉన్నాయి. మొత్తం 20 కుటుంబాల్లో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాశ్చాత్యదేశాల్లో పాములను క్షుద్రమైనవిగా భావిస్తే.. భారత్ లో నాగుపామకు పూజలు చేస్తారు. పాములు 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుంచి పరిణామా చెందినట్లు భావిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ‘సర్పెంటాలజీ’ అనే శాస్త్రంలో చెప్పబడింది. ప్రతీ సంవత్సరం జూలై 16న పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
పాములు పూర్తిగా మాంసాహరులు. ఇవి ఎక్కువగా బల్లులు, చిన్న పాములు, పక్షులు, గుడ్లు, చేపలు, కీటకాలను తింటాయి. కానీ ఓ పాము మాత్రం తన వయసు ఉన్న పామును అమాంత నోట్లో వేసుకొనిమింగేసింది. కర్ణాటక రాష్ట్రంలో మైసూరులోని బోగాడిలోని ప్యలేస్ సిటీ మైసూరులో రెండు పాములు ఒకదగ్గర ఉన్నాయి. వీటిలో ఒక పాము మరో పాములు ఆమాంత నోట్లో వేసుకొని మింగసాగింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి, ఆ తరువాత నెట్టింట్లో పెట్టారు.
ఈ వీడియోపై నెట్టింట్లో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక పాము మరో పామును మింగడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుండగా.. పాములు సాధారణంగానే చిన్న పాములను తింటాయని కొందరు రిప్లై ఇస్తున్నారు. అంతేకాకుండా పాము పగ చాలా కటినమైనది. ఒక్కసారి పగబడితే శత్రువు అంతమయ్యే వరకు విడిచిపెట్టదు. అయితే ఈ పామును కూడా అలాగే చంపేసిందని కొందరు అంటున్నారు.