Bro Trailer Records: అక్షరాలా 30 మిలియన్ వ్యూస్..యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్న పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ ట్రైలర్!

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. అక్కడ అనుకునం దానికంటే ఎక్కువ ప్రీమియర్ వసూళ్లు వచ్చేలాగా అనిపిస్తుంది. బెంగళూర్ లో కూడా నిన్న మధ్యాహ్నం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, అక్కడ కూడా అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చింది ఈ చిత్రం. ఇక హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది.

Written By: Vicky, Updated On : July 24, 2023 3:21 pm

Bro Trailer Records

Follow us on

Bro Trailer Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా ఈవెంట్ కావడం తో అభిమానులు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడబోతున్నాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. అక్కడ అనుకునం దానికంటే ఎక్కువ ప్రీమియర్ వసూళ్లు వచ్చేలాగా అనిపిస్తుంది. బెంగళూర్ లో కూడా నిన్న మధ్యాహ్నం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, అక్కడ కూడా అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చింది ఈ చిత్రం. ఇక హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని మొన్ననే విడుదల చెయ్యగా దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క రోజులోనే 30 మిలియన్ కి పైగా వ్యూస్ ని దక్కించుకున్న ఈ ట్రైలర్ కి 5 లక్షల 60 వేల లైక్స్ వచ్చాయి. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు. టీజర్ కంటే కూడా ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ కారణంగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగాయి. జనాల్లో కూడా ఈ ట్రైలర్ మంచి క్రేజ్ ని పెంచింది. సుమారుగా పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయి ఎంటెర్టైమెంట్ యాంగిల్ లో చూస్తున్నది ఈ సినిమాలోనే అని, మూవీ స్టోరీ కూడా కొత్తరకంగా ఉంది అనే టాక్ బాగా వెళ్ళింది. మరి ఈ అంచనాలు సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్ తెప్పిస్తుందో చూడాలి.