Ration In Benz Car: ఓ సినిమాలో బిచ్చగాడికి బంగారు గిన్నె ఇస్తే ఏం చేస్తాడని అడిగితే దాంతో అడుక్కుంటాడని ఠక్కున సమాధానం వస్తుంది. మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే మారింది. ఆర్థిక అంతరాలు పెరిగి ధనవంతులు ధనవంతులుగానే అవుతున్నారు. పేదవారు మాత్రం పేదవారిగానే ఉండిపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తోంది. దీంతో వాటిని కొందరు తింటున్నా ఆర్థికంగా ఉన్న వారు మాత్రం అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పథకం పక్కదారి పడుతోంది. ఎన్నోమార్లు రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

పంజాబ్ లోని హోషియార్ పుర్ లోని ఓ రేషన్ దుకాణంలో జరిగిన సంఘటన అందరిని ఆలోచనల్లో పడేసింది. పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఏ ద్విచక్ర వాహనమో లేదా సైకిల్ మీదో తీసుకెళ్లడం సహజమే. కానీ ఇక్కడ ఓ వ్యక్తి రేషన్ బియ్యాన్ని ఓ బెంజి కారులో తీసుకెళ్లడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పేదలకు ఇచ్చే బియ్యం కారులో తీసుకెళ్లడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బియ్యం కోసం కారు రావడం ఏమిటని ఆశ్చర్యపోయారు. దేశం ముందుకెళుతోందా? లేక వెనకకు నడుస్తోందా అనే అనుమానాలు అందరిలో వచ్చాయి.
Also Read: Pawan Kalyan Tweet: ఆ ఆలోచన రెప్పపాటులో కార్చిచ్చులా వ్యాపిస్తుంది.. పవన్ కళ్యాణ్ వీరావేశం ఎవరిపై ?
ఈ రేషన్ దుకాణం అమిత్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అతడి దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండటంతోనే తాను బియ్యం ఇచ్చానని చెబుతున్నాడు. డీలర్ మాత్రం అతడు తీసుకొచ్చిన కారు చూడలేదని పేర్కొన్నాడు. కార్డు చూసి బియ్యం ఇచ్చానని చెబుతున్నాడు. దీంతో అతడు కారులో బియ్యం వేసుకునే దృశ్యాన్ని అందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దేశమంతా సంచలనం కలిగిస్తోంది. కోటీశ్వరులకు కూడా రేషన్ కార్డు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఏకంగా అతడు కారులో వచ్చి బీపీఎల్ కార్డు చూపించి రేషన్ బియ్యం తీసుకుని కారులో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం ఆ కారు తనది కాదని చెప్పడం గమనార్హం. మా ఇంటి ముందు ఉన్న వారు విదేశాలకు వెళుతూ తమ ఇంటి ముందు కారు పార్కు చేయడంతో అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నానని బదులిచ్చాడు. తాను పేదవాడినేనని చెబుతున్నాడు. తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని చెప్పడం కొసమెరుపు.
Also Read:Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు’ సినిమాలో జనసేన సీన్.. పిచ్చెక్కిపోవడం ఖాయమట?