Russian Woman: సవతి కొడుకుతో ప్రేమ.. రోమాన్స్.. భర్తకు షాకిచ్చింది.. తర్వాత ట్విస్ట్!

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన షాక్‌కు గురిచేస్తుంది. రష్యాకి చెందిన అలెక్సీ అనే వ్యక్తి మెుదటి భార్య చనిపోయింది. దాంతో అతడు కొన్ని రోజుల తర్వాత మెరీనా బల్మషేవా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Written By: Raj Shekar, Updated On : June 14, 2023 4:32 pm

Russian Woman

Follow us on

Russian Woman: వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చుతున్న సంఘటనలు నిత్యం పదుల సంఖ్యలో చూస్తున్నాం.. ఇవి బయట పడేవి మాత్రమే.. బయట పడకుండా రహస్యంగా కొనసాగేవి అనేకం ఉన్నాయి. పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన భార్య, భర్తలు వాటిని అతిక్రమిస్తున్నారు. వేదమంత్రాల సమక్షంలో అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాన్ని గట్టున పెడుతున్నారు. కామ వాంఛ, మోహం, వ్యామోహంతో పెళ్లి తర్వాత కూడా పాత సంబంధాలను కొనసాగిస్తున్నవారు కొందరైతే.. కొత్తగా సబంధాలు వెతుక్కుంటున్నవారు మరికొందరు. ఇలాంటి అనైతిక సంబంధాలతో కాపురాలను కూల్చుకుంటున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఇలాంటి అనైతిక సబంధం ఒకటి వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన రష్యాలో జరిగింది.

45 ఏళ్ల వ్యక్తిని వివాహమాడి..
సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన షాక్‌కు గురిచేస్తుంది. రష్యాకి చెందిన అలెక్సీ అనే వ్యక్తి మెుదటి భార్య చనిపోయింది. దాంతో అతడు కొన్ని రోజుల తర్వాత మెరీనా బల్మషేవా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అతడు రెండో పెళ్లి చేసుకునే నాటికే అతడికి ఏడేళ్ల కొడుకు వోవా ఉన్నాడు. వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో తన సవతి కొడుకు వయసుకొచ్చాడు. అతనిపై మెరీనా కన్ను పడింది. అంతే సవతి కొడుకునే ముగ్గులోకి దించింది. అతడితో ప్రేమాయణం సాగించింది. క్రమంగా వీరి మధ్య బంధం బలపడింది. వోవా తనపై చూపిస్తున్న ప్రేమ మెరీనాకు అర్ధం అయ్యింది. వోవా ప్రేమ తల్లి కొడుకుల బంధం కాదని, అంతకంటే ఎక్కువే అని ఆమె అర్ధం చేసుకుంది.

పెళ్లి చేసుకోవాలని..
ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో మెరీనా గర్భం దాల్చింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి వోవా వయసు 20 ఏళ్లు. పెళ్లికి అడ్డుగా ఉన్న భర్తకు మోరీనా విడాకులు ఇచ్చి కొడుకును పెళ్లి చేసుకుంది. తాజాగా వీరికి ఒక కూతురు పుట్టడంతో వీరి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే వీరి బంధంపై మెరీనా భర్త అలెక్సీ కోపంతో ఉన్నాడు. తన కొడుకుకు ఏమీ తెలీదని, వాడిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుందని అలెక్సీ చెప్పుకొచ్చాడు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా గానీ నేను ఇంత బాధపడే వాడిని కాదు అని కానీ, నా కొడుకును ప్రేమించినందుకు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మెరీనాకు సపోర్ట్‌ చేస్తే.. మరికొందరు అలెక్స్‌ కు మద్ధతుగా నిలుస్తున్నారు.