https://oktelugu.com/

Kriti Sanon- Prabhas: ఆ స్థానం లో ప్రభాస్ ని తప్ప ఎవరినీ ఊహించుకోలేను..అంతలా నచ్చేసాడు : కృతి సనన్

ప్రభాస్ తో సినిమా చేసిన రోజులు, ఆయనతో మీకు కలిగిన అనుభూతి ఎలా ఉంది అని అడగగా దానికి కృతి సనన్ సమాధానం చెప్తూ 'ప్రభాస్ చాలా కూల్ పర్సన్, ఎదుటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు, అభిమానిస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 14, 2023 4:37 pm
    Kriti Sanon- Prabhas

    Kriti Sanon- Prabhas

    Follow us on

    Kriti Sanon- Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఇండియా లోనే ఆల్ టైం రికార్డు నెలకొల్పే స్థాయి లో ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముందు సినిమాలు లాగ, ప్రభాస్ ఈ సినిమాకి పెద్దగా ప్రొమోషన్స్ చెయ్యలేదు, ఒక్క ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.

    అయ్యినప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ స్థాయిలో జరుగుతున్నాయి అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ చిత్రం లో సీత పాత్ర పోషించిన కృతి సనన్ మాత్రం డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె ప్రభాస్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    ప్రభాస్ తో సినిమా చేసిన రోజులు, ఆయనతో మీకు కలిగిన అనుభూతి ఎలా ఉంది అని అడగగా దానికి కృతి సనన్ సమాధానం చెప్తూ ‘ప్రభాస్ చాలా కూల్ పర్సన్, ఎదుటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఆయన షూటింగ్ ప్రారంభ రోజుల్లో పెద్దగా మాట్లాడేవారు కాదు, చాలా సిగ్గుపడుతూ ఉండేవారు. ఆ తర్వాత తెలుగు లో నా మొదటి సినిమా అనుభవం గురించి తనతో పంచుకున్న. ఆ సినిమా చేస్తున్న సమయం లో మనకి రాని భాషలో నటించాలంటే ఎంత కష్టమో అప్పటి వరకు తెలియదు అని చెప్పాను.అప్పటి నుండి ప్రభాస్ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఏదైనా చాలా ఓపన్ గా మాట్లాడుతారు, ఎలాంటి దాపరికాలు ఉండవు , ఇక ఆదిపురుష్ లో శ్రీ రాముడిగా అద్భుతంగా నటించాడు. ఫైనల్ రష్ చూసిన తర్వాత ఆ శ్రీ రాముడి స్థానం లో మరొక హీరోని ఊహించుకోలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. కృతి సనన్ ప్రభాస్ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉంది అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్రభాస్ గురించి ఇంత ఎఫక్షన్ తో మాట్లాడడం వీళ్లిద్దరి మధ్య ఎదో ఉంది అనే రూమర్ కి మరింత ఊపిరి పోసినట్టు అయ్యింది.