Hyderabad: ప్రపంచంలో అత్యధిక అద్దెలు ఉన్న నగరాలు ఏవంటే ఎవరైనా న్యూయార్క్.. వాషింగ్టన్.. ముంబై, బెంగళూరు పేర్లు చెబుతుంటారు..ఎందుకంటే ఈ నగరాలలో జీవనం అత్యంత ఖరీదైనది కాబట్టి.. పైగా ఈ ప్రాంతాలు అత్యంత అభివృద్ధి చెందినవి.. ఐటీ నుంచి మొదలు పెడితే ఫార్మా వరకు అనేక రకాలైన కార్యకలాపాలు సాగుతుంటాయి. ప్రతిరోజు వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏర్పాటుచేసిన కంపెనీలలో ఉద్యోగాలు చేయడానికి ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వస్తుంటారు.
Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే.
ఆమధ్య ముంబైలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె చదరపు అడుగుకు ₹146.3 పలకడంతో యావత్ భారత్ మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో అంత స్థాయిలో అద్దె ఉండడం ఏంటని షాక్ కు గురైంది. ఇక బెంగళూరులో కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో చదరపు అడుగుకు ₹135 దాకా అద్దె పలకడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్ కూడా స్థానం సంపాదించుకుంది. హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో నిలోఫర్ కేఫ్ ఏర్పాటు కానుంది. అయితే ఈ కేఫ్ ఏర్పాటు చేసే భవనం అద్దె ఇప్పుడు రికార్డు సృష్టిస్తోంది. కనివిని ఎరుగని స్థాయిలో భవనం అద్దె ఉండడంతో రియాల్టీ రంగం నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
అద్దె ఎంతంటే..
హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు కార్యకలాపాల సాగిస్తున్నాయి. కొత్త కొత్త ఐటీ కంపెనీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ భవనాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. అయితే ఈ ప్రాంతంలో ఐటీ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతూ ఉండడం.. ఇతర కార్పొరేట్ వ్యాపారాలు కూడా నడుస్తున్న నేపథ్యంలో నిలోఫర్ కేఫ్ యాజమాన్యం ఇక్కడ ఒక శాఖను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఓ భవనాన్ని అద్దెకి తీసుకుంది. దాని అద్దె ప్రతినెల 40 లక్షల రూపాయల అట. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. పైగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదిశాతం అద్దే పెంచుతారట. ప్రతి నెల 40 లక్షల చొప్పున అద్దె చెల్లించేందుకు ఒప్పందం కూడా కుదిరిందట. భవన యజమానితో నిలోఫర్ కేఫ్ యాజమాన్యం 10 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుందట. త్వరలో నిలోఫర్ కేఫ్ ఇక్కడ తన శాఖను ప్రారంభించబోతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిలోఫర్ కేఫ్ లో ఒక్క చాయ్ ఖరీదు వెయ్యి రూపాయలు దాకా ఉందట. అంటే రాయదుర్గం ప్రాంతంలోనూ అదే స్థాయిలో నిలోఫర్ కేఫ్ యాజమాన్యం చార్జ్ చేస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.. ” 40 లక్షల రూపాయలు నెలకు అద్దె అంటే మామూలు విషయం కాదు.. రాయదుర్గం ప్రాంతంలో నిలోఫర్ కేఫ్ ఇంత చూపిస్తోంది అంటే హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.. బహుశా ఆ కేఫ్ లో సామాన్యులు చాయ్ తాగడానికి సహాసించకపోవచ్చు.. పాత నిలోఫర్ కేఫ్ లో చాయ్ బాగుంటుంది.. అక్కడ దొరికే బ్రెడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ ఎలాంటి రుచులు అందిస్తుంటారో..ఎలాంటి బ్రెడ్ లు అందుబాటులో ఉంటాయో చూడాల్సి ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.