2023 Last Date: ఈ ఏడాది చివరి రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?

మనలో చాలా మంది న్యూమరాలజీని నమ్ముతుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాది చివరి రోజు అయిన 12/31/2023 ఓ ప్రత్యేకతను కలిగిఉంది. అదే న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందంట.

Written By: Suresh, Updated On : December 27, 2023 2:59 pm

2023 Last Date

Follow us on

2023 Last Date: 2023 సంవత్సరం మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. దీంతో 2024 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అందరూ సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ ఏడాది చివరి రోజు అంటే 31వ తేదీ చాలా ప్రత్యేకమైనదట. అవునా ఆ రోజులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ప్రస్తుత సంవత్సరం 2023 లో లాస్ట్ డేట్ ను ఒకసారి మీరు కూడా నిశీతంగా పరిశీలించండి. ఏం అర్థం కావడం లేదా? అయితే ఇది చదివేయండి.

మనలో చాలా మంది న్యూమరాలజీని నమ్ముతుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాది చివరి రోజు అయిన 12/31/2023 ఓ ప్రత్యేకతను కలిగిఉంది. అదే న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందంట. నెల, తేదీ, సంవత్సరాన్ని ఒకసారి గమనించండి. 123123 అని కనిపిస్తుంది కదూ. వీటిలో 123 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెబుతారు. ఈ తరహాలోనే 123, 123123 ఈ వరుస సంఖ్యలను దేవతల సంఖ్యలుగా న్యూమరాలజీ నిపుణులు చెబుతుంటారని తెలుస్తోంది.

అలాగే ప్రతి నంబర్ కు ఓ అర్థం ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది. 123లోని ప్రతి సంఖ్యకు అర్థం ఉంటుంది. అది ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిగా 1. నంబర్ వన్ ఎప్పుడు కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. నంబర్ 2 ఆనందకరమైనది అలాగే భావోద్వేగాలను సూచిస్తుంది. ఇక నంబర్ 3.. ఏదైనా నేర్చుకోవడాన్ని కానీ ఎదుగుదలను కానీ సూచిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూడు అంకెలను కలిపితే నంబర్ 6 వస్తుంది. నంబర్ 6 సమతుల్యత, ప్రేమలకు సూచికగా నిలుస్తుందని న్యూమరాలజీ పేర్కొంది. అదేవిధంగా 12, 23 నంబర్లు స్థిరమైన శక్తికి నిర్వచనంగా ఉండగా 31 మాత్రం అనుకున్నట్లుగా జరగట్లేదు అనే అర్థాన్ని సూచిస్తుందంట. ఈ నేపథ్యంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా రానున్న 2024 శక్తి, ప్రకాశాన్ని సూచిస్తుందని న్యూమరాలజీ ప్రకారం చెబుతున్నారు. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం అని పేర్కొన్నారు. దీంతో ఈ తేదీకి సంబంధించిన పలు విషయాలు, మీమ్స్, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.