Shubman Gill: గిల్ టెస్ట్ కెరియర్ ని నాశనం చేస్తున్న రోహిత్ శర్మ…

పర్ఫామెన్స్ కి ఫిదా అయిన రోహిత్ శర్మ అతన్ని ఓపెనర్ గానే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.ఇక తనతో పాటు రోహిత్ కూడా ఓపెనర్ గానే వస్తున్నాడు. దీనివల్ల నెంబర్ 3 లో గిల్ వస్తున్నాడు అందువల్లే గిల్ తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు.

Written By: Gopi, Updated On : December 27, 2023 3:03 pm

Shubman Gill

Follow us on

Shubman Gill: టెస్ట్ క్రికెట్ లో శుభ్ మన్ గిల్ పరిస్థితి రోజురోజుకీ చాలా దారుణంగా తయారవుతుంది…ఇక ఇప్పటికే టెస్ట్ టీమ్ లోకి యశస్వి జైశ్వాల్ ఓపెనర్ గా వచ్చి తన టాలెంట్ ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే శుభ్ మన్ గిల్ మాత్రం నెంబర్ త్రీ పొజిషన్ లో బ్యాటింగ్ కి వస్తూ పేలవమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నాడు. నిజానికి గిల్ ఓపెనర్ ప్లేయర్ గా రావాల్సింది. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ లో యశస్వి జైస్వాల్ టీమ్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత తను మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్నాడు.

ఇక దాంతో ఆయన పర్ఫామెన్స్ కి ఫిదా అయిన రోహిత్ శర్మ అతన్ని ఓపెనర్ గానే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.ఇక తనతో పాటు రోహిత్ కూడా ఓపెనర్ గానే వస్తున్నాడు. దీనివల్ల నెంబర్ 3 లో గిల్ వస్తున్నాడు అందువల్లే గిల్ తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు సౌతాఫ్రికా మీద ఆడుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా నెంబర్ 3 లో బ్యాటింగ్ వచ్చిన శుభ్ మన్ గిల్ ఏ మాత్రం మంచి పర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఇక దాంతో ఇదంతా చూసిన శుభ్ మన్ గిల్ అభిమానులు రోహిత్ శర్మ వల్లే గిల్ టెస్ట్ కెరీయర్ పాడైపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక గత 6 టెస్ట్ ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ 30 పరుగుల మార్కును దాటలేదు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అందులో నాలుగు ఇన్నింగ్స్ లలో ఆయన నెంబర్ 3 లోనే బ్యాటింగ్ కి వచ్చాడు. ఇక అందులో రెండు ఇన్నింగ్స్ లలో ఓపెనర్ గా వచ్చినప్పటికీ అందులో కూడా పెద్దగా సత్తా అయితే చాటలేదు… 13,18,6,10,29,2 పరుగులు చేశాడు. నిజానికి శుభ్ మన్ గిల్ మొదటి మ్యాచ్ ల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తు వచ్చాడు. దాంతో ఇండియన్ టీం కి కోహ్లీ దొరికాడు అని అందరి అనుకున్నారు. కానీ అతను ఇప్పుడు దారుణమైన పర్ఫామెన్స్ ఇస్తుండడం నిజంగా అందరిని బాధకి గురిచేస్తుంది.

ఎందుకు ఇంత దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అంటే తను నెంబర్ 3 లో ఆడలేకపోతున్నాడు అంటూ కొంతమంది సమాధానం చెప్తున్నారు…మరి ఇప్పటికైనా శుభ్ మన్ గిల్ ని ఓపెనర్ ప్లేయర్ గా పంపించే ప్రయత్నం చేస్తారా లేదా అనే విషయం మీదనే ఇప్పుడు చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి…