Free Bus Travel
Free Bus Travel: ‘అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు. భర్తమీద అలిగి పుట్టింటికి వెళ్లొచ్చు. మొక్కులు తీర్చుకోవడానికి గుడికి వెళ్లొచ్చు. షాపింగ్‌కు మార్కెట్‌కు వెళ్లొచ్చు’ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్‌గా ప్రస్తుత సీఎం చెప్పిన మాటలివీ. ఆయన ఆశించినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మాట ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ ప్రయాణ సౌకర్యం కల్పించారు. కానీ, ఉచిత ప్రయాణం ఏమో కానీ, కండక్టర్లకు, మహిళలకు మధ్య పంచాయితీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ కనీ, వినీ ఎరుగని గొడవలు ఫ్రీ బస్ పుణ్యాన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉచితం వద్దని..
ప్రభుత్వం ఉచితంగా తెలంగాణ అంతటా తిరగొచ్చని చెబుతుంటే.. ఉద్యోగాలు చేసే మహిళలు, సాధారణ పురుషులు మాత్రం ఉచితం వద్దే వద్దంటున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు గతంలో ఎక్కడ ఆపమంటే బస్సు అక్కడ ఆపేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఉచితం నేపథ్యంలో డ్రైవర్లు స్టాప్ వద్ద మాత్రమే బస్సు ఆపుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ మహిళలు పాఠశాలల ముందే గతంలో బస్సు దిగేవారు. కానీ ఇప్పుడు బస్సు కోసం స్టాప్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. స్టాప్‌లో దిగి బడికి రావాల్సిన పరిస్థితి. ఇక ఉచిత ప్రయాణం పుణ్యాన బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. 70 శాతం మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. ఫలితంగా పురుషులు డబ్బులు చెల్లించినా కూర్చుని ప్రయాణించలేని పరిస్థితి. ఈ విషయాల్లో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ‘గుర్తింపు’ పంచాయతీ..
ఇక ఆర్టీసీ బస్సుల్లో తాజాగా కొత్త పంచాయితీ జరుగుతోంది. ప్రయాణికులకు మొదటి వారం ఎలాంటి గుర్తింపు లేకున్నా అనుమతించారు. తర్వాత ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ లాంటి గుర్తింపు తప్పనిసరి చేశారు. ఆ గుర్తింపు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని లేనివారు టికెట్ తీసుకోవాలని ఎండీ సజ్జనార్ ఆదేశించారు. గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. జిరాక్స్, ఫోన్‌లో ఫొటోలు చూపిస్తే చెల్లవని స్పష్టం చేశారు. కానీ, ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. తన ఫోన్‌లో ఆధార్ కార్డు చూపి అనుమతించాలని కండక్టర్‌తో పంచాయితీ పెట్టుకుంది. అనుమతి లేదని కండక్టర్ ఎంత చెప్పినా.. సదరు యువతి దబాయించడమే కాకుండా, నేను సదువుకున్న.. ఎక్కడ ఆధార్ కార్డు అయినా నంబర్ ఒక్కటే కదా.. ఒరిజినల్ ఉంటే నంబర్ మారుతుందా… మీ డీఎంకు మాట్లాడతా అంటూ ఓవరాక్షన్ చేసింది. కానీ కండక్టర్ మాత్రం రూల్ ప్రకారం ఒరిజినల్ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అది లేకుంటే టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే సదరు యువతికి తోటి ప్రయాణికులెవరూ మద్దతు ఇవ్వలేదు. అయినా ఆమె అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొత్తంగా మహాలక్ష్మి పుణ్యాన తమకు రోజుకో పంచాయితీ తప్పడం లేదని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు మహిళలు కావడంతో తమ బుర్రలు బద్ధవలువుతన్నాయిన పేర్కొంటున్నారు.
బస్సుల్లో ఉచిత ప్రయాణం పలు చోట్ల గొడవలకు దారి తీస్తోంది.
ఉచితంగా ప్రయాణించాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ/పాస్ పోర్ట్ లాంటి ఒక గుర్తింపు కార్డు ఉండాలని అంటున్న కండక్టర్లు. అయితే ఓ యువతి ఫోన్‌లో ఆధార్ నంబర్ చూపించడంతో కండక్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దీంతో ఆమెకు, కండక్టర్ కు… pic.twitter.com/CYSYFMbZZV
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2023