
Trolls on Venkatesh: మనిషన్నాక తప్పులు చేస్తారు. అలానే హీరో వెంకటేష్ కూడా చిన్న తప్పు చేశారు. దొరక్క దొరక్క దొరికాడనేమో కానీ ఏకిపారేస్తున్నారు. రానా నాయుడు సిరీస్ వెంకీ ఇమేజ్ డ్రైనేజ్ లో ముంచేసింది. బూతుల సిరీస్ ని అసలు వెంకీ ఎలా ఒప్పుకున్నాడని ఆడేసుకుంటున్నారు. వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల హీరో. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఆయనకు భారీ క్రేజ్ తెచ్చాయి. మహేష్, ప్రభాస్ వంటి హీరోలు వచ్చే వరకు రొమాంటిక్ హీరో అంటే వెంకీనే. ఆయన నటించిన ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా చిత్రాలతో వెంకటేష్ లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు ఫ్యామిలీ చిత్రాల హీరో అయ్యారు.
ఈ జానర్లో ఆయన్ని కొట్టినోళ్లు లేరు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ తో వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యారు. పరిశ్రమలో మినిమమ్ గ్యారంటీ హీరో ఆయనే. కారణం… ఆయన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. అందుకే వెంకటేష్ సినిమా సెలక్షన్ చాలా బాగుంటుంది. తన ఇమేజ్ కి తగ్గట్లు అన్ని ఎమోషన్స్ కథలో ఉండేలా చూసుకుంటారు. లేడీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని వల్గర్, అడల్ట్ కంటెంట్ లేకుండా జాగ్రత్త పడతారు.
అలాంటి వెంకీని రానా నాయుడు సిరీస్లో చేసిన పాత్ర అబాసుపాలు చేసింది. దారుణమైన బూతులు, బోల్డ్ సీన్స్ తో ఎపిసోడ్స్ నింపేశారు. రానా నాయుడు ఫస్ట్ ఎపిసోడ్ మొదలైన నిమిషాలకే టీవీ ఆఫ్ చేసే పరిస్థితి. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి చూసే సాహసం చేయవద్దంటున్నారు. పచ్చి బూతులు విచ్చలవిడిగా వాడేశారు. ఎంత డిజిటల్ కంటెంట్ అయితే మాత్రం, ఈ రేంజ్ లో అరాచకమా అని వాపోతున్నారు.

ఈ క్రమంలో వెంకటేష్ పెద్ద ఎత్తున ట్రోల్స్ కి గురవుతున్నారు. రానా నాయుడు సిరీస్ పై పదుల సంఖ్యలో మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. గత మూడు రోజులుగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మూడు దశాబ్దాల ఇమేజ్ వెంకీ ఒక్క సిరీస్తో పోగొట్టుకున్నాడని అంటున్నారు. రానా నాయుడు హాలీవుడ్ వెబ్ సిరీస్ రే డోనోవన్ రీమేక్. ఒరిజినల్ తాలూకు క్యారెక్టర్స్ యథావిధిగా దించేశారు. ఇక్కడే పొరపాటు జరిగింది. ఇండియన్ ఆడియన్స్, వెంకటేష్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కొంచెం బోల్డ్నెస్ తగ్గించాల్సింది. మొత్తంగా వెంకటేష్ పప్పులో కాలేశారంటున్నారు.
https://twitter.com/WhynotCinemas/status/1634441958289731584?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634441958289731584%7Ctwgr%5E065b88f7b8181dc8672fe55462433e06384139f2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-1055996411957391553.ampproject.net%2F2302271541000%2Fframe.html
https://twitter.com/TheVishnuBekaar/status/1634441301826633728?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634441301826633728%7Ctwgr%5E24ad20b186a46c2050199a74ef08fe94bd963ee8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-1055996411957391553.ampproject.net%2F2302271541000%2Fframe.html
https://twitter.com/gully_poragadu/status/1634478666649595907?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634478666649595907%7Ctwgr%5E5513671c3e822c3ccdc997b89b634a085560dde0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-1055996411957391553.ampproject.net%2F2302271541000%2Fframe.html
Venkatesh undu kada ani idhi family tho chudakandi roy…! #RanaNaidu pic.twitter.com/W0YLWJA8QD
— Tony (@tonygaaaadu) March 10, 2023