
Rana Daggubati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. వందకు పైగా సినిమాలు నిర్మించిన దగ్గుబాటి రామానాయుడు మూవీ మొగల్‌గా పేరు తెచ్చుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలోకి సురేశ్‌బాబు నిర్మాతగా ఎంట్రీ ఇస్తే, వెంకటే‹శ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే సురేశ్‌బాబు కొడుకు రానా కూడా హీరోగా, విలన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
తొలి వెబ్‌సిరీస్‌లో బాబాయ్ అబ్బాయ్..
హీరో వెంకటేశ్, హీరో, విలన్ రానా కలిసి తొలిసారిగా ఓ వెబ్‌సిరీస్‌లో నటించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా తన చిన్ననాటి జ్ఞాపకాలను అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ‘నాకు చిన్నప్పటì æనుంచి∙ఇప్పటివరకు ఎంతోమంది సన్నిహితులు, స్నేహితులు ఉన్నారు. ఇక నేను హైదరాబాదులోనే పెరగడం వల్ల అందరూ నాకు మంచి స్నేహితులయ్యారు. అందులో నాకు ఎక్కువ క్లోజ్ రామ్ చరణ్.. ఎందుకంటే రామ్ చరణ్, నేను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. 9వ తరగతి వరకు ఇద్దరం చెనై్నలో చదువుకున్నాం’ అని చెప్పాడు. ఎవరికీ తెలియని మరొక విషయం ఏమిటంటే అంటూ.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తమ క్లాస్‌మేట్ అని తెలిపాడు. రామ్‌చరణ్ భార్య ఉపాసన తమకు జూనియర్ అని వెల్లడించాడు. ‘స్నేహరెడ్డి, ఉపాసన మాతోనే చదువుకున్నారు అని చాలామందికి తెలియదు’ అని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే పోటీ కచ్చితంగా ఉంటుందని, అది కేవలం సినిమా వరకే ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఉండదు అని వెల్లడించారు రానా.

ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ…
ఇక రామ్‌చరణ్, తాను ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు రానా. చాలామంది హీరోలలో ప్రాణ స్నేహితులు ఉంటారని, అలాంటి వారిలో నా పేరు రామ్ చరణ్ పేరు కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రానా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రానా వెంకటేశ్ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌ని చూసి చాలామంది తిట్టుకుంటున్నారు. అందులో బూతు మాటలు ఎక్కువగా ఉన్నాయని, ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉన్నా మీ పరువు మొత్తం పోయింది అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.