https://oktelugu.com/

Viral Video: పెళ్లి మండపంలో ఇంత ఉద్రేకమా.. ఆగలేకపోయిన వధువు ఏం చేసిందంటే.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. ఉత్తర భారత దేశంలోని ఒక ప్రాంతంలో ఓ యువతీ, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి వయసు 25 సంవత్సరాల్లోపే ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 3, 2024 / 08:17 AM IST

    Viral Video

    Follow us on

    Viral Video: మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. ఇప్పట్లో ముహూర్తాలు లేవు కాబట్టి శుభకార్యాలు జరిగే ఛాన్స్ లేదు. మళ్లీ పెళ్లిళ్లు జరగాలంటే ఆగస్టు దాకా ఎదురుచూడాల్సిందే. కానీ, ఉత్తర భారత దేశంలో అలా కాదు.. అక్కడ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. అక్కడ జరిగే పెళ్లిళ్లు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సాగుతాయి. అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు.. మాంసాహారం కంటే శాకాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు మిఠాయిలు కూడా తినిపించుకునే ఆచారం ఉంటుందక్కడ. అలా మిఠాయిలు తినిపించుకునే విషయంలో ఓ వధువుకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..

    సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. ఉత్తర భారత దేశంలోని ఒక ప్రాంతంలో ఓ యువతీ, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి వయసు 25 సంవత్సరాల్లోపే ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత వధువు వరుడికి రసగుల్లా తినిపించడం అక్కడ ఆనవాయితీ. దాని ప్రకారం ఆ వధువు వరుడికి రసగుల్లా తినిపించింది. అతడు తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత తన వంతుగా భార్యకు రసగుల్లా తినిపించబోయాడు. ఆమె వద్దని వారించింది. చేసుకున్న భార్య కదా అనే చనువుతో బలవంతంగా తినిపించబోయాడు. అంతే.. పట్టరాని కోపంతో ఆ వధువు ఒక్కసారిగా అతడిని నెట్టేసింది. అంతేకాదు కోపంతో ఆ రసగుల్లాను మొత్తం పెళ్లి వేదికలోనే ఊసేసింది. వరుడిని బూతులు తిట్టింది. కాలితో ఒక్క తన్ను తన్నింది. దీంతో బంధువులు అప్రమత్తమై, ఆ అమ్మాయికి సర్ది చెప్పారు. మరి కొంతమంది ఆ అమ్మాయిని తిట్టారు.

    సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వధువు కోపాన్ని చూసిన చాలామంది నెటిజెన్లు ఆమెను కాళికాదేవితో పోల్చుతున్నారు. వరుడిపై జాలి చూపిస్తున్నారు. అతన్ని అలా కొడుతుంటే బంధువులు వినోదం చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. కనీసం ఆ వరుడిలో కొంచెం కూడా కోపం కలగకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందేమో సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఇలా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.