https://oktelugu.com/

Vitamin D Foods: విటమిన్ డి లభించే ఈ ఫుడ్ లను తీసుకోండి..

విటమిన్ డి లోపం వల్ల చర్మం, ఎముకలు, రోగనిరోధక శక్తి మీద ప్రభావం పడుతుంది. అందుకే విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఎముకల ఎదుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, కణాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది విటమిన్ డి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 3, 2024 / 08:34 AM IST

    Vitamin D Foods

    Follow us on

    Vitamin D Foods: శరీరానికి తగినన్ని ప్రోటీన్లు, విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉంటాము. మినరల్స్ వంటివి కూడా చాలా అవసరం. కానీ బిజీ షెడ్యూల్ వల్ల, అధిక పనుల వల్ల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదు చాలా మంది. దీంతో ఆసుపత్రుల సంఖ్య, రోగిస్టుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఫ్రీగా వచ్చే విటమిన్ డి గురించి, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ విటమిన్ డి ఉదయం వచ్చే సూర్య కిరణాల వల్లనే కాదు కొన్ని తక్కువ ధరలో లభించే ఫుడ్ లలో కూడా ఉంటుంది. అవేంటి అంటే..

    విటమిన్ డి లోపం వల్ల చర్మం, ఎముకలు, రోగనిరోధక శక్తి మీద ప్రభావం పడుతుంది. అందుకే విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఎముకల ఎదుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, కణాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది విటమిన్ డి. ఈ విటమిన్ డి కొన్ని సహజమైన ఆహారాలలో, లేదంటే సప్లిమెంట్స్ ద్వారా లభిస్తుంది. గుడ్డులోని పచ్చసొన లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఒక గుడ్డులోని పచ్చసొనలో 37 ఐయూ విటమిన్ లభిస్తుంది. ఒక 3.5 ఔన్స్ సాల్మన్ ఫిల్లెట్లు 450 IU విటమిన్ ఉంటుంది.

    సాల్మాన్, ట్యూనా, సార్డిన్, మకారూన్, హెర్రింగ్ వంటి చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి కాబట్టి కచ్చితంగా రోజు వారి ఆహారంలో ఈ విటమిన్ ఉండేలా చేసుకోవాలి. వీటి కోసం పుట్టగొడుగులు, ఆవు పాలు కూడా తీసుకోవచ్చు. ఇక ఉదయం కాసేపు ఎండలో నిల్చొంటే చాలు ఫ్రీగా మీకు విటమిన్ డి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీగా వచ్చే ఈ విటమిన్ ను కాదనకుండా ఉదయం ఎండలో నిల్చొండి. కొన్ని ఆహార పదార్థాలు కూడా తీసుకోండి.