Cancer: మనదేశంలో క్యాన్సర్ కేసులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ 2024 నివేదిక ప్రకారం మనదేశంలో 2022లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయాయని తేలింది. క్యాన్సర్ కేసులు పెరిగేందుకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం అని ఇన్ని రోజులపాటు అనుకున్నాం. పలు వైద్య నివేదికలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. కానీ, అవి మాత్రమే కాకుండా.. మన దైనం దిన జీవితంలో ఆహారపు అలవాట్లు, కొన్ని వస్తువుల వినియోగం వంటివి కూడా క్యాన్సర్ కలిగిస్తాయని తాజా నివేదికలో తేలింది.
బొగ్గు లేదా తారుతో తయారు చేసిన వస్తువులు
బొగ్గు లేదా తారు ను ప్రాసెస్ చేసి తయారు చేసిన వస్తువులు ఆరోగ్యానికి అంత మంచివి కాదట. ఇవి జీర్ణ క్యాన్సర్ కేసులకు దారి తీస్తాయట. జుట్టుకు వాడే రంగులు, సౌందర్య సాధనాలు, షాంపూలలో తారు, బొగ్గు ను ప్రాసెస్ చేసిన పదార్థాలను వాడతారట. అవి క్యాన్సర్ కు దారి తీస్తాయట. అందులో ఉన్న రసాయనాలు క్యాన్సర్ కారకాలను ప్రేరేపించి.. ఆ తర్వాత ఆ వ్యాధికి దారి తీసేలా చేస్తాయట.
పారా బెన్స్
పారా బెన్స్ వంటి రసాయనాల సమ్మేళనాన్ని సబ్బులు, షాంపూలు, షేవింగ్ క్రీముల తయారీలో వాడతారు. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. సంతానోత్పత్తికి ప్రతికూలంగా మారుతాయి. ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ కు కారణవుతాయి. ఇటువంటి వాటిని నిరోధించేందుకు పారా బెన్ ప్రీ లేబుల్ కలిగి ఉన్న ఉత్పత్తులను వాడడం శ్రేయస్కరం.
ఫార్మాల్డి హైడ్
ఫార్మాల్డి హైడ్ అనేది ఒక రంగులేని వాయువు. ఇది గాడమైన వాసన కలిగి ఉంటుంది. దీనిని నిర్మాణ సామగ్రిలో తయారీలో ఉపయోగిస్తారు. ఆటోమొబైల్ పరికరాలు, వస్త్రాలు, క్రిమిసంహారకాలు వంటి వాటిని దీనితోనే తయారుచేస్తారు. ఇది నాసో ఫారిన్జియల్, ల్యూకే మియా వంటి క్యాన్సర్ కు కారణమవుతుందట.
తాలెట్స్
తాలెట్స్ అనేవి సింథటిక్ సువాసనను కలిగి ఉంటాయి. వీటితో పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నెయిల్ పాలిష్, ఎయిర్ ఫ్రెషనర్స్ తయారు చేస్తారు. ఇవి అలర్జీలకు కారణం అవుతాయి. రొమ్ము క్యాన్సర్ కు దారి తీస్తాయి. శరీరంలో హార్మోన్ల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. వీటినుంచి కాపాడుకోవాలంటే బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులను వాడాలి.
యాక్రిలా మైడ్
మనలో చాలామందికి వేయించిన వస్తువులను తినడం అలవాటు. కొంతమంది డీప్ ఫ్రై లను ఇష్టపడుతుంటారు. నూనెలో అధికంగా ఆహార పదార్థాలను వేయించడం వల్ల యాక్రిలా మైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ తయారీలో వాడే బేకింగ్ సోడా, ఇతర పదార్థాలను వాడినప్పుడు యాక్రిలా మైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది.