https://oktelugu.com/

Warangal: ముహూర్తం వేళ ఈ వరుడి ఆ బాధను అర్థం చేసుకోండయ్యా!

తొర్రూర్‌లో తన పెళ్లి ఉదయం 10 గంటలకు ఉందని, ముహూర్త సమయానికి కారులో వెళుతుండగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని వరుడు టెన్షన్‌ పడ్డాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 8, 2023 / 02:43 PM IST

    Warangal

    Follow us on

    Warangal: హిందూ వివాహం అంటేనే ముహూర్తం. శుభ గడియల్లో పెళ్లి చేస్తే.. సంసారం సాఫీగా సాగుతుంది. వైవాహిక జీవితానికి ఆటంకాలు ఉండవని నమ్ముతారు. అందుకోసమే మంచి ముహూర్తం చేసుకుని మళ్లీ పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇక పెళ్లికి కూడా హిందూ సమాజంలో కొన్ని సంప్రదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. నాడు 16 రోజులు పెళ్లి వేడుకలు నిర్వహించేవారట. మారుతున్న పరిస్థితులు.. ఉరుకులు పరుగల జీవితం.. సెలవులు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణంతో పెళ్లి వేడుక ఇప్పుడు మూడు రోజులకు తగ్గింది. ఈ మూడు రోజుల హడావుడి మామూలుగా ఉండదు. ఈ హడావుడి అంతా ముహూర్త సమాయానికి పెళ్లి చేయాలనే. కానీ, ఇక్కడ ఓ పెళ్లి కొడుకు ఇంటి వద్ద అన్నీ చేసుకున్నాడు. పెళ్లి కోసం అమ్మాయింటికి ఉత్సాహంగా బయల్దేరాడు. కానీ, అనుకోని ఆటంకం.. అతడిని ఇబ్బంది పెట్టింది. చివరకు దానిని అధిగమించి పెళ్లి మండపానికి చేరుకున్నాడు.

    ట్రాఫిక్‌లో చిక్కుకుని..
    వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన గురువారం ఉదయం పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెళ్లికి వెళ్తున్న వరుడు ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. ముహూర్తం దగ్గరపడుతున్నా రద్దీ తగ్గలేదు. బోల్తా పడిన ట్యాంకర్‌ అక్కడే ఉండిపోయింది.

    వరుడి హైరానా..
    తొర్రూర్‌లో తన పెళ్లి ఉదయం 10 గంటలకు ఉందని, ముహూర్త సమయానికి కారులో వెళుతుండగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని వరుడు టెన్షన్‌ పడ్డాడు. కారు దిగి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు. పెళ్లి ముహూర్తం దాటిపోతోందని, తన కోసం మండపంలో వధువు వేచి ఉన్నందున వెంటనే వాహనాలను క్లియర్‌ చేయాలని కోరాడు. అదే పనిచేస్తున్నామని.. కొంత సమయం పడుతుందని అధికారులు ఆయనకు సూచించారు.

    వెనక్కి వెళ్దామని..
    అయితే అసహనానికి గురైన వరుడు మరో మార్గంలో వెల్దామని, కారును వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. కాగా.. ట్రాఫిక్‌ జామ్‌పై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బోల్తా పడిన ట్యాంకర్‌ను భారీ క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీరింది. ట్రాఫిక్‌ క్లియర్‌ కావడంతో మళ్లీ వెనక్కి వచ్చిన పెళ్లికొడుకు తొర్రూరు వెళ్లాడు.

    ఏది ఏమైనా అనుకోని ట్రాఫిక్‌ పెళ్లయిన కొడుకుని కాసేపు టెన్షన్‌ పెట్టింది. ప్రధాన రహదారిపై దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసుల చొరవతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఊపిరి పీల్చుకున్నాడు.