Lady Shaving: కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. సోషల్ మీడియా వచ్చాక కొన్నికొన్ని వీడియోలు చూస్తుంటే.. కాలజ్ఞానం నిజమే అనిపిస్తుంది. మన ఊహకు కూడా అందని ఎన్నో వింతలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వింత ఏమిటో చూద్దాం.
సెలూన్‌లో షేవింగ్..
ఓ సినిమాలో పవన్ కల్యాణ్.. ‘సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అంతే.. మిగతాదంతా సేమ్ టూ సేమ్’ అని పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడు. అంటే మగవాడు గడ్డం గీసుకోవడం కామనే.. సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ కోసం సెలూన్‌కు వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కు వెళ్లి షేవ్ చేయించుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి అంటున్నారు.
అందులోనూ సమానమేనా..
మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటుంటారు. ఈ వీడియో చూసిన వారు షేవింగ్‌లోనూ తాము మగవాళ్లతో సమానమే అని నిరూపించుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో అమ్మాయిలు షేవింగ్ చేస్తారని విన్నాం.. ఇండియాలో మరి ఇదేం పిచ్చో అర్థం కావడం లేదు… ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అమ్మాయి ఏమందంటే..
సెలూన్‌లో షేవింగ్ గురించి సదరు యువతి ఏమందంటే.. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృతకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. షేవింగ్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.
बदलाव प्रकृति का नियम है। 😌😌 pic.twitter.com/HjAeu4kUOv
— Cyber Huntss (@Cyber_Huntss) August 3, 2023