Jagan-Ponguleti: పరస్పర అవసరాల ఆధారంగానే రాజకీయాలు సాగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఉంది. ఫర్ సపోజ్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులను ట్రాన్స్ ట్రాయ్ అనే కంపెనీ నిర్వహించింది. ఇది మరెవరితో కాదు రాయపాటి సాంబశివరావుది. ఆయన చంద్రబాబు ఫోల్డ్ లో వ్యక్తి. పైగా 2019 ఎన్నికల్లో ఈయన ద్వారా దేశంలో ప్రతిపక్షాలకు చంద్రబాబు నాయుడు డబ్బు సర్దుబాటు చేశారని ఒక ఆరోపణ ఉంది. చంద్రబాబు అలా డబ్బు గంతులు వేస్తుంటే మోడీ దానికి తగ్గట్టుగానే ఒత్తడం మొదలుపెట్టాడు. సీన్ కట్ చేస్తే 23 దగ్గర ఆగిపోయాడు . ఇదే వరుసలో కేసీఆర్ ఏం చేశాడో కూడా అందరికీ తెలుసు. కారు, సారు, 16 అని వీర లెవల్లో కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు. బెంగళూరు కుమార స్వామికి డబ్బులు సర్దుబాటు చేశారు అనే ఆరోపణలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.
కెసిఆర్, చంద్రబాబు వంతు అయిపోయింది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వచ్చింది. తన రాష్ట్రంలో పలు రకాల కాంట్రాక్టులను తన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్, తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు స్థానానికి చెందిన మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టులు ఇస్తున్నాడు. గతంలో చిన్నాచితక పనులు చేసుకునే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా పెద్ద కంపెనీగా మారిపోయింది. ఈ కంపెనీకి వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తున్నారని సమాచారం. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి భూగర్భ విద్యుత్ లైన్ పనులకు సంబంధించిన కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. దీని విలువ కూడా వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని పలు కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్న ప్రభుత్వం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి మాత్రం వెంటవెంటనే డబ్బుల చెల్లింపు జరుపుతున్నారు. దీంట్లో మతలబు ఏంటి అని ఆరా తీస్తే..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరుతారు అని అందరూ అనుకున్నారు. పొంగులేటి కూడా అదే రకమైన సంకేతాలు ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే.. బిజెపిలో చేరాలి అని చెప్పారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని భారతీయ జనతా పార్టీ వైపు కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి మార్చుకున్నారు. రాహుల్ గాంధీని ఖమ్మం రప్పించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తూనే ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీకి జగన్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇండియా కూటమి ద్వారా రేపటి నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ తోనీ అంటకాగుతున్నారు. రాజకీయంగా ద్వంద్వ ప్రయాణం సాగిస్తూ వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులేకుండా చూసుకుంటున్నారు. దేశంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే పసికట్టే మోడీ, అమిత్ షా.. మరి జగన్ అడుగుల గురించి తెలుసుకున్నారా? ఎలాగూ ఢిల్లీ బిల్లుకు ఓకే చెప్పాడు కాబట్టి లైట్ తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.