Divorce Case Video: అది మామూలు కొట్టుడు కాదు.. విపరీతంగా మురికితో ఉన్న బట్టలను.. బండకేసి బాదినట్టు.. బాగా పొలుసులు ఉన్న చేపలను రాకినట్టు.. అంత కోపంతో కొట్టింది. సాధారణంగా అయితే ఆ దెబ్బలకు ఎవరూ తట్టుకోలేరు. పైగా ఆమె అతడిని కోర్టు ఆవరణలో దెబ్బలు కొట్టింది. ఆమె అంతలా కొడుతున్నప్పటికీ అతడు నవ్వుతూ ఉన్నాడు. కనీసం వారించే ప్రయత్నం కూడా చేయడం లేదు. అతడు నవ్వుతుంటే ఆమె మరింత రెచ్చిపోతుంది.
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వీడియోకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో భర్తను భార్య కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది. ఆమె తీవ్ర స్థాయిలో కొడుతున్నప్పటికీ.. జుట్టు పట్టి లాగుతున్నప్పటికీ.. అడ్డగోలుగా బూతులు తిడుతున్నప్పటికీ.. ఎగిరి ఎగిరి తంతునప్పటికీ అతడు నవ్వుతూనే ఉన్నాడు.
ఆమె ఓ ఐటీ ఉద్యోగి. భర్తకు మాత్రమే ఎటువంటి ఉద్యోగం లేదు. ఎటువంటి ఉద్యోగం లేని వ్యక్తిని ఆమె ఎందుకు పెళ్లి చేసుకుందో తెలియదు. కాకపోతే వారిద్దరు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా కొంత సమయం ఇచ్చింది. ఇద్దరిలోనూ మారే లక్షణాలు కనిపించకపోవడంతో విడాకులు మంజూరు చేసింది. భార్య భరణం కోసం కేసు వేసింది. ఈ క్రమంలోనే భర్త తన పేరు మీద ఉన్న ఆస్తులను మొత్తం తల్లి పేరు మీద బదిలీ చేయించాడు. తనకు ఎటువంటి ఆస్తులు లేవు కాబట్టి.. ఆదాయం కూడా లేదు కాబట్టి భరణం ఇవ్వలేనని కోర్టు ముందు చెప్పాడు. అతని వాదనలను కోర్టు ఒప్పుకుంది. అంతేకాదు, ఆమెకు భరణం ఇచ్చే పరిస్థితిలో భర్త లేడని తీర్పు చెప్పింది.
కోర్టు తీర్పుతో భార్య ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు బయట భర్తను దారుణంగా కొట్టింది. చంపలు వాయించింది. జుట్టు పట్టుకొని లాగింది. అయితే ఆమె అంతలా కొడుతున్నప్పటికీ అతడు మాత్రం నవ్వుతూనే ఉండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత మహిళల పరిస్థితి ఇలానే ఉంటుందని.. అని కొందరు వ్యాఖ్యానిస్తే.. మరికొందరేమో భార్యకు అన్యాయం చేసిన భర్త పై మండిపడ్డారు. ఇంకొందరేమో విడాకులు తీసుకునే భార్యలకు భరణం మీద ఈ స్థాయిలో ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు.
She took a divorce chasing alimony.
The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing.
After the divorce, the guy is smiling even while getting beaten.
On behalf of all men — salute to you!
— Oxomiya Jiyori (@SouleFacts) December 29, 2025