https://oktelugu.com/

Punjab: వంటచేస్తుండగా పేలిన ప్రెషర్‌ కుక్కర్‌.. భయానక వీడియో వైరల్‌..!

ఈ వీడియోలో కుక్కర్‌ బ్లాస్టింగ్‌ భయానకంగా ఉంది. ఇద్దరు మహిళలు వంటగదిలో పని చేస్తుండగాగ్యాస్‌పై ఉంచిన కుక్కర్‌ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి టేబుల్‌ వద్ద కూర్చుని ఉండగా సమీపంలో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 13, 2023 / 06:10 PM IST

    Punjab

    Follow us on

    Punjab:  వంటింట్లో స్టౌ ఎంత ముఖ్యమో.. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ప్రెషన్‌ కుక్కర్‌ అంతే ముఖ్యమైనదిగా మారింది. త్వరగా వంట చేయడానికి చాలా మంది ప్రెషర్‌ కుక్కర్‌ వాడుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ కుక్కర్ల వినియోగం ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. అయితే ఈ ప్రెషర్‌ కుక్కర్స్‌తో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు అనేక చూశాం. చదివాం. అందుకే వంట చేసేప్పుడు జాగ్రత్తగా ఉంటాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ, తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వంట చేస్తుండగా ప్రెషర్‌ కుక్కర్‌ బ్లాస్ట్‌ అయింది.

    వంట గదిలో.. వంట చేస్తుండగా..
    ఈ వీడియోలో కుక్కర్‌ బ్లాస్టింగ్‌ భయానకంగా ఉంది. ఇద్దరు మహిళలు వంటగదిలో పని చేస్తుండగాగ్యాస్‌పై ఉంచిన కుక్కర్‌ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి టేబుల్‌ వద్ద కూర్చుని ఉండగా సమీపంలో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా కుక్కర్‌లో పేలుడు సంభవించి కుక్కర్‌ పైకప్పు ఎగిరిపోయింది.. వంటగది మొత్తం పొగతో నిండిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. మహిళ కుక్కర్‌లో కూరగాయలు వండుతున్నట్లు సమాచారం. గ్యాస్‌ ఎక్కువ కావటంతో కుక్కర్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

    పంజాబ్‌లో ఘటన..
    ఈ వీడియోలోని ఘటన పంజాబ్‌లోని పాటియాలాలో జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఓ చిన్నారి సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. పేలుడు ధాటికి ఇంట్లోని వారంతా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పేలుడు ధాటికి వంటగదిలో ఉంచిన వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది.