spot_img
Homeట్రెండింగ్ న్యూస్Love Marriage: ‘లంక’ను గెలిచిన లవ్‌ స్టోరీ : శ్రీలంక అమ్మాయితో కరీంనగర్‌ అబ్బాయి ప్రేమ...

Love Marriage: ‘లంక’ను గెలిచిన లవ్‌ స్టోరీ : శ్రీలంక అమ్మాయితో కరీంనగర్‌ అబ్బాయి ప్రేమ పెళ్లి కథ

Love Marriage: సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో.. ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసింది. వేళ మైళ్ల దూరంకూడా క్షణాల్లో వీక్షించగలుగుతున్నాం. ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులూ పెరుగుతున్నారు. ఇలా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్గునూర్‌ అబ్బాయి.. శ్రీలంక నుంచి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అమ్మాయి మధ్య ప్రేమ స్నేహం ఏర్పడింది. దేశం, భాష వేరైనా భావం ముఖ్యం అన్నట్లుగా.. క్రమంగా వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పదేళ్లు నిలపుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు.

ఆస్ట్రేలియాలో ప్రేమ..
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌కు చెందిన దాసం అరుణ్‌కుమార్‌ స్థానిక జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. శ్రీలంలో డిగ్రీ చదివిని అజ్జూరా.. ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. 2014లో ఇద్దరూ పరిచయమయ్యారు. ఈ క్రమంలో వారిమధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.

పెద్దలు కాదన్నా..
అయితే వీరి లవ్‌స్టోరీ కొంతకాలానికి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ ప్రేమను పెద్దలు మొదట అంగీకరించలేదు. దేశం కాని అమ్మాయితో లవ్‌ ఏంటి అని వారించారు. కానీ, వారు తమ ప్రేమను దూరం చేసుకోవాలనుకోలేదు. అదే సమయంలో పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకోలేదు. పెద్దలను ఓప్పించి.. వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఉద్యోగ వేట..
స్టడీ వీసాపై వెళ్లిన దాసం అరుణ్‌కుమార్‌కు అక్కడే ఉద్యోగాన్వేషణ కొనసాగించారు. ఈక్రమంలో వీసా గడువు ముగియడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు అజ్జూరా కూడా ఉద్యోగ వేటలో విజయం సాధించింది. అరుణ్‌ మాత్రం వీసా గడువు ముగియడంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయాడు. ఈ క్రమంలో అజ్జూరా తన ప్రియుడికి అండగా నిలిచింది. వీసా రెన్యూవల్‌ కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యాయి.

యూకేలో సెటిల్‌..
తర్వాత అరుణ్‌కుమార్‌ కూడా ఉద్యోగాన్వేషణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ యూకే(లండన్‌లో) ఒకే కంపెనీలో ఉద్యోగం సాధించారు. దీంతో ఇద్దరూ ఆస్ట్రేలియా నుంచి లండన్‌ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు. మరోవైపు పదేళ్లుగా వీరి ప్రేమను కొనసాగిస్తూ వచ్చారు. తమ ప్రేమను గెలిపించాలని ప్రయత్నాలు వేగవంతం చేశారు.

చివరకు పెళ్లిపీటలెక్కారు..
పెద్దలు తమ పెళ్లి అంగీకరించలేదని లేచపోతున్న, ఆత్మహత్య చేసుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పదేళ్లుగా తమ ప్రేమ ప్రయాణాన్ని సాగించి చివరు పెద్దలను ఒప్పించారు. అదే సమయంలో ప్రేమను పెద్దలు అంగీకరించలేదని కుంగిపోలేదు. జీవిత లక్ష్యాన్ని మరువ లేదు. అనుకున్న గోల్‌ రీచ్‌ కావడంతోపాటు తమ ప్రేమను పెద్దలు ఒప్పుకునేలా చేశారు. చివరకు అరుణ్‌కుమార్‌.. శ్రీలంక అమ్మాయి అజ్జూరాతోపాటు ఆమె తల్లిదండ్రులు, ధనపాల, దమయంతి, కుటుంబ సభ్యులను తీసుకుని అల్గునూర్‌కు వచ్చాడు అరుణ్‌కుమార్‌.

అంగరంగ వైభవంగా పెళ్లి..
ఇక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు సమక్షంలో కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల(మెహందీ, హల్దీ, పెళ్లి) వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. శ్రీలంక నుంచి వచ్చిన అజ్జూర తల్లిదండ్రులు మన సంప్రదాయాలను చూసి ముచ్చట పడ్డారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెళ్లి భరాత్‌తో అమ్మాయి, అబ్బాయితోపాటు శ్రీలంక నుంచి వచ్చిన వారు కూడా స్టెప్పులేశారు. రాముడు సీత కోసం లంకను గెలిచినట్లు.. ‘లంక అమ్మాయిని గెలిచిన రాముడు.. మా వరుణ్‌కుమార్‌’ అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version