https://oktelugu.com/

23వ అంతస్తుపై నుంచి.. 14 ఏళ్ల బాలిక డేంజర్ గేమ్?

దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రజల్లో భయాందోళన పెంచుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ అమలు వల్ల ఎంతో బిజీగా ఉండే వారికి సైతం విశ్రాంతి దొరుకుతోంది. పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అన్నా చెల్లెలు మాత్రం ఆన్ లైన్ గేమ్స్ ఆడి బోర్ కొట్టిందేమో ప్రాణాలనే ప్రమాదంలో పెట్టే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 13, 2020 11:32 am
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రజల్లో భయాందోళన పెంచుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ అమలు వల్ల ఎంతో బిజీగా ఉండే వారికి సైతం విశ్రాంతి దొరుకుతోంది. పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అన్నా చెల్లెలు మాత్రం ఆన్ లైన్ గేమ్స్ ఆడి బోర్ కొట్టిందేమో ప్రాణాలనే ప్రమాదంలో పెట్టే డేంజర్ గేమ్ ఆడారు.

    అన్నా చెల్లెలు ఒకరికొకరు తమకే ధైర్యం ఎక్కువని పందెం వేసుకున్నారు. అన్న కంటే తనే ధైర్యవంతురాలని నిరూపించుకోవాలని చెల్లెలు భావించింది. 23వ అంతస్తు కొనభాగం మీద నుంచి నడిచి తనకే అన్న కంటే ధైర్యం ఎక్కువని నిరూపించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా 23వ అంత‌స్థు కొన నుంచి మూడుసార్లు నడిచింది. ఇంత భయానక సాహసం చేసిన బాలిక వయస్సు కేవలం 14 ఏళ్లే కావడం గమనార్హం.

    ఈ నెల 6వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23వ అంతస్తుపై బాలిక నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలిక కాలు జారితే ప్రాణాలకే ప్రమాదం కావడంతో బాలిక తల్లిదండ్రులపై సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైకు స‌మీపంలోని కేళంబ‌క్క‌మ్‌లో జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు బాలిక, బాలిక సోదరుడిని ఇలాంటి ప్రమాదకరమైన పందేల వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సున్నితంగా హెచ్చరించి వదిలేశారు.