https://oktelugu.com/

భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమైన వార్త.. ఏదీ తప్పుడు వార్త అన్నది తెలియకుండా ఉంది. పుంకాను పుంకానులుగా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలోకి వచ్చిపడుతున్నాయి. కనీసం నిర్ధారణ చేసుకోకుండా అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయి. Also Read: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్? తాజాగా కర్ణాటకలో బెంగళూరులో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధీకులు ఒక మతం గురించి ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. బెంగళూరు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2020 / 11:33 AM IST
    Follow us on


    సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమైన వార్త.. ఏదీ తప్పుడు వార్త అన్నది తెలియకుండా ఉంది. పుంకాను పుంకానులుగా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలోకి వచ్చిపడుతున్నాయి. కనీసం నిర్ధారణ చేసుకోకుండా అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయి.

    Also Read: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్?

    తాజాగా కర్ణాటకలో బెంగళూరులో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధీకులు ఒక మతం గురించి ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. బెంగళూరు నగరాన్ని నిన్న నిద్రలేకుండా చేసింది. గొడవలు, దాడులు, వాహనాలు, ఆస్తుల దహనాలతో రావణ కాష్టంగా మారింది. ఏకంగా పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 78మంది పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

    ఇక తాజాగా దేశంలోనే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఘోరమైన తప్పు చేశారు. కనీసం ఆలోచించకుండా నిన్న రాత్రి భారత మాజీ రాష్ట్రపతి ‘ప్రణబ్ ముఖర్జీ ’ చనిపోయాడని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. అది దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్రవేసిన ప్రణబ్ కు మన తెలంగాణ నేతలు, ప్రజలు కూడా కీర్తిస్తూ నివాళులర్పించారు.

    కానీ దారుణమైన విషయం ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదు. ఆయన వెంటిలేటర్ పై విషమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడే వెల్లడించాడు. ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మరణించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి బతికే ఉన్నారని.. వదంతులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

    Also Read: సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?

    దీంతో తెల్లవారి తప్పు తెలుసుకున్న జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రణబ్ కుటుంబ సభ్యులకు.. ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్టు నకిలీ వార్తలకు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ నకిలీ వార్తల మాయలో పడి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను.. ట్వీట్ చేసే ముందు దాన్ని తిరిగి ధృవీకరించకపోవడం నా వృత్తిపరమైన తప్పు. అందరికీ క్షమాపణలు .. ప్రణబ్ కుటుంబానికి సారీ చెబుతున్నట్టు సర్దేశాయ్ వివరించారు.

    ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డం కట్టడంతో ఆయనకు ఢిల్లీలో మిలటరీ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వెంటి లేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నారు.

    ఇలా దిగ్గజ మీడియాలు.. వాటి అధినేతలు.. ప్రముఖులు కూడా ఫేక్ న్యూస్ మాయలో పడిపోయి కనీసం నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. తద్వారా బతికున్న వారిని కూడా చంపేస్తున్నారు. చూస్తుంటే భారతదేశ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిమ్మిని బమ్మిని చేసే మీడియా కనీసం సమాచారం సేకరించకుండా ఫీల్డ్ వర్క్ చేయకుండా వార్తలు వండివార్చుతోందన్న సంగతి తేటతెల్లమైంది.

    -ఎన్నం