
WhatsApp: మెసేజింగ్ యాప్ సంచలనం వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. మెసేజింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్ కాలింగ్, పేమెంట్స్, ఫోటో ఎడిట్ తదితర ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. తాజాగా మరో మూడు ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేర్ చేసే వెసలు బాటు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ నుంచి 30 కి మించి మీడియా ఫైల్స్ షేర్ చేసే అవకాశం లేదు.. ఫీచర్ అప్డేట్ లో భాగంగా ఈ లిమిట్ 100 ఫైల్స్ కు పెంచుతున్నట్టు వాట్సాప్ తెలిపింది.
ఒరిజినల్ క్వాలిటీతో ఇమేజ్ లు షేరింగ్ చేసుకోవడంతో పాటు క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి చాట్ హిస్టరీ ఇతరులకు బదిలీ చేసే అవకాశాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ డేటా సేవ్ చేసేందుకు శరవేగంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోటోను కంప్రెస్ చేయాల్సి వస్తోంది.. తాజా అప్డేట్ ప్రకారం ఒరిజినల్ క్వాలిటీతో హై రిజల్యూషన్ ఫోటోలు షేర్ చేయవచ్చు ఫోటోల షేరింగ్ కు ముందే ఒరిజినల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఒకేసారి 100 ఫైల్స్ పంపేందుకు రూపొందించిన ఫీచర్ ప్రస్తుతం తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.. ఇప్పటికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాకుంటే యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫీచర్ ఆప్డేట్ చేసుకోవాలి. వాట్సప్ ఆండ్రాయిడ్ 2.23.4.3 వెర్షన్ అప్డేట్ చేసుకోవాలి.. ఈ ఫీచర్ త్వరలో ఈ ఆపిల్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తామని వాట్సప్ ప్రకటించింది.

వాట్సాప్ చాట్ లో తరచుగా ఫోటోలు షేర్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.. ఇటీవలే వాట్సప్ తన యూజర్లకు వీడియో మోడ్ ఫీచర్ పరిచయం చేసింది. ఇంతకుముందు మాదిరిగా యూజర్లు వీడియో రికార్డింగ్ కోసం కెమెరా బటన్ నొక్కి పెట్టాల్సిన అవసరం ఉండదు. రికార్డింగ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒరిజినల్ క్వాలిటీ లో ఫోటోలు షేర్ చేసుకునేలా వాట్సప్ కొత్త అప్డేట్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకనుంచి గూగుల్ డ్రైవ్ వాడకుండానే న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తే సరిపోతుంది. బ్యాకప్ చాట్ లకు వెళ్లి, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయకుండా నేరుగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే ఎప్పుడు ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని సంగతి మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు.. మరోవైపు దేశీయంగా పలు సంస్థలు మెసేజ్ యాప్ లను తయారు చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి పోటీ ఎదుర్కొనేందుకు వాట్స్అప్ ఈ కొత్త విధానాలకు నాంది పలికిందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.