Tamanna Bhatia: ఎంత మంది కొత్త హీరోయిన్స్ పరిశ్రమకు వస్తున్నా తమన్నా జోరు తగ్గడం లేదు. ఆమె భారీ ప్రాజెక్ట్స్ ఖాతాలో వేసుకుంటూ అందరికీ ఝలక్ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. తమన్నా ఈ చిత్రంతో రెండోసారి చిరంజీవితో జతకడుతున్నారు. గతంలో వీరి కాంబోలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. సైరా పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు.

భోళా శంకర్ మూవీలో చిరు-తమన్నా మరోసారి జంటగా అలరించనున్నారు. కాగా తమన్నా ఇంకో భారీ ప్రాజెక్ట్ ప్రకటించింది. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ లో తమన్నా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఫ్యాన్స్ తో షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఫైనల్లీ ఈ న్యూస్ మీకు చెప్పాలి. వన్ ఓన్లీ తలైవా రజినీకాంత్ సర్ తో జైలర్ మూవీలో నటించే అవకాశం వచ్చినందుకు నేను సంతోషంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆనందాన్ని మీతో చెప్పకుండా ఉండలేకున్నాను… అని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. దీంతో తమన్నా పోస్ట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. సునీల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగం అవుతున్నారు. ఈ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. తాజాగా జైలర్ లో తమన్నా జాయిన్ అయినట్టు వెల్లడించారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా జైలర్ విడుదలయ్యే సూచనలు కలవు. పెద్దన్న మూవీ తర్వాత రజినీకాంత్ జైలర్ చేస్తున్నారు.

ఇక తమన్నాపై ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తరచుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి విందులు, విహారాల్లో పాల్గొంటున్నారు. రెండు వారాలుగా విజయ్ వర్మ-తమన్నా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను తమన్నా ఖండించకపోవడం విశేషం. సాధారణంగా తమన్నా తనపై వచ్చే పుకార్లకు వెంటనే స్పందిస్తారు. మరి విజయ్ వర్మతో తమన్నా బంధం ఏమిటో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.