
Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన అనంతరం ఇంట్లో కోలుకుంటున్న భారత స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను పలువురు మాజీ క్రికెటర్లు తాజాగా పరామర్శించారు. స్వయంగా రిషబ్ పంత్ ఇంటికి వెళ్లిన ఆ మాజీ క్రికెటర్లు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపి పంత్ కు ధైర్యాన్ని చెప్పారు. వీలైనంత త్వరగా కోలుకుంటావని, ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయా క్రికెటర్లు పంత్ కు మనోధైర్యాన్ని కల్పించారు.
కోలుకుంటున్న పంత్..
గత ఏడాది డిసెంబర్ 30న పంత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ – డెహ్రాడూన్ హైవేలో కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సలను నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో కోరుకుంటున్నట్లు కొద్దిరోజుల కిందట స్వయంగా పంత్ ట్విట్ చేశాడు. ఇకపోతే పంత్ చికిత్సకు అవసరమైన ఖర్చును బీసీసీఐ పెట్టుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేంతవరకు అనుక్షణం బీసీసీఐ పంత్ కు అవసరమైన సహాయ సహకారాలను అందించింది.

ఇంటికి వెళ్లిన క్రికెటర్లు వీళ్లే..
ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కోరుకుంటున్న పంత్ ను తాజాగా పలువురు మాజీ క్రికెటర్లు పరామర్శించారు. స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, బ్యాట్స్ మెన్ సురేష్ రైనా పంత్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలను తెలుసుకోవడంతోపాటు.. కొన్ని గంటల సమయం గడిపి తిరిగి వచ్చారు. మానసికంగా పంత్ దృఢంగా ఉండడం వల్లే కోరుకుంటున్నాడని ఈ సందర్భంగా వాళ్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఇండియన్ క్రికెట్ లో అంటూ ఆటను చూస్తామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పంత్ కు అరుదైన గౌరవాన్ని ఇస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోరుకుంటున్నా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ పడాలి ఐపిఎల్ కు దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జట్టుకు పంత్ దూరంగా ఉన్న నేపథ్యంలో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. జట్టుకు దూరమైనప్పటికీ పంత్ కు అరుదైన గౌరవాన్ని ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది పంత్ జెర్సీ నెంబర్ తో బరిలోకి దిగాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ధ్రువీకరించాడు. ‘మేం పంత్ ను చాలా మిస్ అవబోతున్నాం. ప్రతి మ్యాచ్ కు లో అతడు నా పక్కన కూర్చోవాలని భావిస్తున్నాను. ఒకవేల అది కుదరకపోతే నాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాము. మేము అతడు జెర్సీ నెంబర్ను మా షర్టులపై లేదా క్యాప్ లపై ఉంచాలి అనుకుంటున్నాం’ అని పాంటింగ్ వెల్లడించాడు.