
Rahul Gandhi ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి రాహుల్ గాంధీ నుంచి కేసీఆర్ దాకా పదేపదే చెప్తూ ఉంటారు గానీ.. సరైన ప్రశ్న వేసే జర్నలిస్టు తగలాలి గాని ఉత్తిగానే అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ లో v6 ఛానల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఎలా స్పందించాడో చూసాం కదా.. ఏకంగా వి6, వెలుగు పేపర్ ను భారత రాష్ట్ర సమితి అధికారిక కార్యక్రమాలకు పిలవకూడదని నిషేధం విధించారు. ఇలాంటివారు మనకు విలువల గురించి, విలువల సారం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటారు.. ఇక రాహుల్ గాంధీ కూడా ఇంతకుమించి రెండు ఆకులు ఎక్కువే చదివారు. ఆయన జోడో యాత్రకు ప్రచారం కల్పించేందుకు మీడియా కావాలి కానీ.. ఎదురు ప్రశ్న వేసేందుకు మీడియా ఉండకూడదు. అలాగే సాగుతోంది ఆయన వ్యవహారం కూడా
తనను తాను గాంధీ వారసుడిగా చెప్పుకునే రాహుల్.. వ్యవహార శైలిలో ఆ తీరు మాత్రం ప్రదర్శించడు. మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు సావర్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే.. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అంటూ రంకెలు వేస్తాడు. ఇక ఆయన అనుకూల మీడియా సరే సరి. ఏకంగా భారతదేశం ఆగం అయిపోతుందంటూ కలరింగ్ ఇస్తుంది.
ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాని మీదనే చర్చ జరుగుతోంది. నేపథ్యంలోనే రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించాడు. అదా నీ గురించి, నరేంద్ర మోడీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. మరి ఇంత నీతులు చెప్పే రాహుల్ గాంధీ అప్పట్లో కృష్ణ గోదావరి బేసిన్ అంబానీ పరం ఎందుకయిందో చెప్పలేదు. అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శాఖను రాత్రికి రాత్రే ఎందుకు మార్చారో చెప్పలేదు.

సిగ్గు లేదా చిన్నయ్య అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది రాహుల్ గాంధీ వ్యవహారం. పైగా పార్లమెంటు వేటు వేసిన అనంతరం అతడిలో అసహనం పెరిగిపోతుంది. రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న కేసులో ఆయనను దోషిగా కోర్టు తేల్చడంపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. రాహుల్ గాంధీలో అసహనం పెరిగిపోయింది. దానికి సమాధానం చెప్పలేక ఆ జర్నలిస్టుకు బిజెపి బ్యాడ్జి పెట్టుకో అని అతన్ని తిట్టాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని కలగజేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ వీడియోను బిజెపి సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. రాహుల్ గాంధీకి బీపీ పెరిగిపోయిందని, ముందు ఒక మంచి డాక్టర్ కు చూపించుకుంటే మంచిదని సలహా ఇస్తోంది. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ మాటల వల్లే రాహుల్ గాంధీ చులకన అవుతున్నారు. అభాసు పాలవుతున్నారు.