
Ram Gopal Varma: సాధారణంగా రాంగోపాల్ వర్మ గురించి తెలిసిన వారు ఎవరైనా.. ఆయనతో గెలుక్కోరు. పూర్తి ప్రాక్టికల్ మనిషి అయిన తను.. దేనికి లొంగడు. ఏ బంధంలోనూ ఇమిడిపోడు. తను ఒక స్వేచ్ఛ పిపాసి.. అలాంటి మనిషితో ఏదైనా వాదించినా, ఇంకో విషయం మీద చర్చించినా మన బుర్రే ఖరాబ్ అవుతుంది. అయాన్ రాండ్ పుస్తకం ప్రభావం రామ్ గోపాల్ వర్మపై తీవ్రంగా ఉంటుంది.. అందుకే అతడు కాలాతీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తెలుసో, తెలియకో కొంతమంది మేధావులు, టీవీ చానల్స్ వారు రామ్ గోపాల్ వర్మతో డిబేట్లు పెడుతూ ఉంటారు.. ఈ సందర్భంగా పలు వివాదాస్పద విషయాలను ఆయన మాట్లాడుతూ ఉంటారు.. ఇంకేముంది యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ సైట్లు పండగ చేసుకొంటాయి. దానికి మరింత మసాలా యాడ్ చేసి పబ్లిష్ చేస్తుంటాయి.
ఈమధ్య రామ్ గోపాల్ వర్మ విశాఖపట్నంలోని యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వెళ్లారు. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిన వారు ఎవరైనా ఆయనను అతిథిగా పిలిచేందుకు ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అంత బోల్డ్ గా ఉంటాయి. దీనివల్ల వినే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. మొన్న జరిగిన స్నాతకోత్సవంలోనూ ఆయన ఇదేవిధంగా బోల్డ్ కామెంట్స్ చేశాడు. తిండి, నిద్ర, సెక్స్ కోసం ఏమైనా చేయండి అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చాడు. దీంతో అక్కడున్న విద్యార్థులు కేరింతలు కొట్టారు. యూత్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసు కనుక రామ్ గోపాల్ వర్మ అలాంటి కామెంట్స్ చేశాడు. మీడియా కూడా విశేష ప్రాధాన్యమించింది.

ఇది జరిగిన తర్వాత కొంతమంది మహిళ లాయర్లు రామ్ గోపాల్ వర్మ మీద అంత ఎత్తున లేచారు. అతడి తీరును తప్పు పట్టారు. రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలిచిన కళాశాల యాజమాన్యాన్ని కడిగిపారేశారు. కోర్టులో కేసు కూడా వేశారు. ఇది జరిగిన తర్వాత రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించి వీడియోను తనదైన స్టైల్ లో పోస్ట్ చేశారు. మహిళా లాయర్లు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే రామ్ గోపాల్ వర్మ స్పైడర్ సినిమాలో విలన్ మాదిరి ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియో ద్వారా చెప్పాడు. నలుగురికి నచ్చినది నాకు అసలు నచ్చదు. నరులు ఎవరూ వెళ్లే దారిలో నేను నడవని అంటూ తన వీడియో ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే నవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hare Rama Hare Krishna pic.twitter.com/tt1f2nRcvk
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023