Homeక్రీడలుSunrisers Hyderabad: బంగారాన్ని వదులుకున్న సన్ రైజర్స్ జట్టు..! అనుభవిస్తోంది ఇప్పుడు

Sunrisers Hyderabad: బంగారాన్ని వదులుకున్న సన్ రైజర్స్ జట్టు..! అనుభవిస్తోంది ఇప్పుడు

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad

Sunrisers Hyderabad: హైదరాబాద్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో జోరు చూపించలేకపోతోంది. దీనికి కారణం కీలకమైన ప్లేయర్లను వదులుకోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ వంటి కీలక ప్లేయర్లను వదులుకోవడం ఆ జట్టు మేనేజ్మెంట్ చేసిన కీలక తప్పిదంగా చెబుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే నిలకడైన ఆటకు మారుపేరుగా చెప్పేవారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 2020 వరకు ఇదే విధంగా జట్టు ఆటతీరు కొనసాగింది. అనూహ్యంగా 2021 నుంచి రైజర్స్ జట్టు గాడి తప్పింది. మెరుగైన ఆట తీరు కనబరచలేక ఆ జట్టు ఆపసోపాలు పడుతోంది. 2021 సీజన్ లో అయితే అత్యంత ఘోరంగా ఆట తీరు కనబరిచింది. ఆ సీజన్ లో పాయింట్ల రైజర్స్ జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. గతంలో జట్టును ఛాంపియన్ గా నిలిపిన వార్నర్ ను వదులుకుంది. ఇక 2022లో మరోసారి పేలవ ప్రదర్శన చేసింది హైదరాబాద్ జట్టు. ఆ తరువాత కేన్ విలియమ్సన్ తో పాటు పలువురు కీలక ప్లేయర్లను వదిలేసుకుంది.

తగ్గిపోయిన రైజర్స్ జట్టు దూకుడు..

డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ తోపాటు 2022 సీజన్ లో సన్ రైజర్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నికోలస్ పూరన్ ఉన్నాడు. అటువంటి పూరన్ ను 2023 సీజన్ కు హైదరాబాద్ జట్టు వదులుకుంది. ఇక మినీ వేలంలోకి వచ్చిన పూరన్ ను లక్నో జట్టు రికార్డు స్థాయిలో రూ. 16 కోట్లకు సొంతం చేసుకుంది. పూరన్ కు అంత డబ్బా అంటూ అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్ 2023లో లక్నో జట్టుకు పూరన్ ఆపద్బాంధవుడిలా మారిపోయాడు. సుడిగాలి ఇన్నింగ్స్ తో జట్టుకు అపురూప విజయాలను అందిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ పూరన్ అదరగొట్టాడు. ఢిల్లీ పై 36 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగులు, సన్ రైజర్స్ పై 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆర్సీబీ జట్టుపై పూనకం వచ్చినట్లు చెలరేగిపోయిన పూరన్.. ఏకంగా 19 బంతుల్లో 62 పరుగులు చేసి అసాధ్యం అనుకున్న విజయాన్ని జట్టుకు సాధ్యం చేసి చూపించాడు. దీంతో మంచి ప్లేయర్ ను అనవసరంగా వదులుకున్నామనే భావనలో సన్ రైజర్స్ అభిమానులు ఉన్నారు.

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad

ఒంటి చేత్తో విజయాలు అందించగల సత్తా..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వదులుకున్న డేవిడ్ వార్నర్, కెన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ తోపాటు రషీద్ ఖాన్, విజయ్ శంకర్ లు తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సామర్థ్యం ఉన్నవాళ్లు. అటువంటి ప్లేయర్లను వదులుకున్న హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ముక్కుతూ, మూలుగుతూ ముందుకు సాగుతోంది. ఈ ప్లేయర్లు హైదరాబాద్ జట్టు నుంచి ఇతర జట్టుల్లోకి వెళ్లిన తర్వాత.. హైదరాబాద్ జట్టు పరిస్థితి పూర్తి అగమ్య గోచరంగా తయారయింది. 16వ ఎడిషన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ జట్టు ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకుంది.

పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ఆటగాళ్లు..

ముఖ్యమైన ముగ్గురు ప్లేయర్లను వదులుకున్న హైదరాబాద్ జట్టు.. మినీ వేలంలో భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేయర్లు చేతులెత్తేస్తుండడంతో ఇబ్బందులు పడుతోంది. మినీ వేలంలో బ్రూక్ ను రూ.13.25 కోట్లకు రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్కసారి కూడా 15 పరుగులకు మించింది చేయలేదు. వారి స్థానంలో ఇచ్చిన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో హైదరాబాద్ జట్టు 16 వ ఎడిషన్ లో మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోతోంది.

RELATED ARTICLES

Most Popular